NTV Telugu Site icon

Israel–Hamas war: గాజాలో నిరాశ్రయులు బస చేస్తున్న స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. 100 మందికి పైగా మృతి

Hamas

Hamas

Israel–Hamas war: గాజాలో ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తుంది. తాజాగా తూర్పు గాజాలో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న ఓ స్కూల్‌పై దాడులు జరిపాయి ఇజ్రాయెల్ సేనలు. ఈ ఘటనలో ఏకంగా 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం. అలాగే, చాలా మంది గాయపడినట్లు పాలస్తీనా అధికార వార్తా సంస్థ తెలిపింది. గత వారం కూడా మూడు పాఠశాలలపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లు పేర్కొనింది. అయితే, ఆగస్టు 4వ తేదీన గాజా నగరంలో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న స్కూల్ పై జరిపిన దాడిలో 30 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. అంతకుముందు రోజే నగరంలోని హమామా అనే పాఠశాలపై దాడి చేయడా 17 మంది మృతి చెందారు. ఇక, ఆగస్టు 1న దలాల్ అల్- ముఘ్రాబీ స్కూల్‌పై దాడి చేయగా.. అందులో 15 మంది మృత్యువాత పడ్డారు.

Read Also: Delhi Deputy CM Post: మరోసారి మనీష్ సిసోడియాకు డిప్యూటీ సీఎం పదవి..?

అయితే, గతేడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌లో టెరర్రిస్టులు నరమేధం సృష్టించి వందలాది మందిని హత్య చేశారు. నాటి నుంచి హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుంది. సైనిక దాడిని స్టార్ట్ చేసినప్పటి నుంచి హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లుగా అనుమానిస్తున్న అన్ని బిల్డింగ్ లపై దాడులు చేసుకుంటూ వస్తుంది. ఉగ్రవాదులు ఉంటున్నారని డౌట్ వచ్చిన స్కూల్స్‌పై దాడులకు కూడా ఇజ్రాయెల్ ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. కాగా, గత 10 నెలల సుదీర్ఘ యుద్ధంలో గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని అంచనా.

Show comments