Site icon NTV Telugu

El Mencho: మెక్సికో డ్రగ్ డాన్ ఎల్ మెన్చో ఎలా దొరికాడు.. పట్టించింది ఎవరంటే..!

Elmencho

Elmencho

మెక్సికోలో డ్రగ్ డాన్ ఎల్ మెన్చో హత్య తర్వాత దేశం అట్టుడికింది. ఎల్ మెన్చో అనుచరులు రణరంగం సృష్టించారు. ఆస్తుల ధ్వంసంతో పాటు వాహనాలు తగలబెట్టారు. దాదాపు 20 రాష్ట్రాల్లో బీభత్సం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అసలు ఎల్ మెన్చో ఎలా పట్టుబడ్డాడు. ఎలా దొరికాడో వివరాలను మెక్సికన్ రక్షణ మంత్రి వెల్లడించారు. ఎల్ మెన్చోను కలిసేందుకు శనివారం ప్రియురాలు టప్పాల్పా అనే గ్రామంలోకి వచ్చింది. అయితే ఆమెపై ఎప్పటి నుంచో అమెరికా నిఘా పెట్టడంతో వెంటనే మెక్సికో దళాలకు సమాచారం అందించింది. వెంటనే దళాలు ముట్టడి వేశాయి. ఇంతలో అలర్టైన ఎల్ మెన్చో దాకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడి అనుచరులు ఎదురుకాల్పులకు దిగారు. భద్రతా దళాలు ధీటుగా ఎదుర్కోవడంతో ఎల్ మెన్చో గాయాలు పాలయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యలోనే చనిపోయాడు.

మెక్సికన్ రక్షణ మంత్రి రికార్డో ట్రెవిల్లా వివరాల ప్రకారం.. ఎల్ మెన్చోకు అనేక మంది స్నేహితురాళ్లు ఉన్నారని.. అందులో ఒకామెను ఎల్ మెన్చోకు అత్యంత విశ్వాపాత్రుడు తప్పాల్పాలోని ఒక ఇంటికి తీసుకొచ్చాడని తెలిపారు. శనివారం ఎల్ మెన్చోను కలిసి ఆమె వెళ్లిపోయిందని చెప్పారు. అనంతరం భద్రతా సిబ్బందితో కలిసి ఎల్ మెన్చో ఇంటిలోనే ఉన్నాడని.. వెంటనే సైన్యం అప్రమత్తం అయినట్లు వెల్లడించారు. వెంటనే సైనికులు రహస్యంగా ఆకస్మిక ఆపరేషన్‌ నిర్వహించారని తెలిపారు. ఎల్ మెన్చో దగ్గర శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయని.. 2015లో కూడా ఒక సైనిక హెలికాప్టర్‌ను కూల్చేసి తప్పించుకున్నాడని చెప్పారు. ఈ సమయంలో కూడా ఎదురుదాడికి దిగాడని వెల్లడించారు.

ఈ క్రమంలో ఎల్ మెన్చో అటవీ ప్రాంతంలోకి వెళ్లి దాక్కున్నాడని.. దీంతో సైన్యం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి పొదల్లో కొనుగొన్నట్లు వివరించారు. అతడి అనుచరులు వెంటనే సైనిక హెలికాప్టర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని.. దీంతో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చిందన్నారు. ఎదురుకాల్పుల్లో ఎల్ మెన్చో.. అతడి భద్రతా సిబ్బంది ఇద్దరూ గాయపడ్డారని పేర్కొన్నారు. ముగ్గురినీ హెలికాప్టర్ ద్వారా గ్వాడలజారాలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు తెలిపారు. ప్రస్తుతం మృతదేహాలను మెక్సికో నగరానికి విమానంలో పంపించి జనరల్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి అప్పగించారు. ఎల్ మెన్చో మృతదేహాన్ని అతని కుటుంబానికి అందజేస్తామని భద్రతా మంత్రి ఒమర్ గార్సియా హర్ఫుచ్ తెలిపారు. ఖననం ఎక్కడ జరుగుతుందో ఇంకా నిర్ణయించలేదన్నారు.

Exit mobile version