Russia-Ukraine War: మెక్‌డొనాల్డ్స్ కొత్తపేరుతో రీఎంట్రీ.. ఎగబడిన జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను నిరసిస్తూ రష్యాలో తమ సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడు మూతబడ్డ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్ చెయిన్ మెక్‌డొనాల్డ్స్ రెణ్నెల్ల తర్వాత మళ్లీ తెరుచుకుంది. రష్యాలో మెక్‌డొనాల్డ్స్ యాజమాన్య హక్కులను స్థానిక వ్యాపారవేత్త అలెగ్జాండర్ గోవర్ కొనుగోలు చేశారు. తాజాగా ఆదివారం మాస్కోలో సరికొత్త పేరుతో మెక్‌డొనాల్డ్స్‌ను పునఃప్రారంభించారు.
దిగ్గజ ఫాస్ట్‌పుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్.. రష్యాలో తన కార్యకలాపాలను కొత్త పేరుతో ఆదివారం ప్రారంభించింది. మాస్కోలోని పుష్కిన్ స్క్వేర్‌లో రెస్టారెంట్ యజమాని అలెగ్జాండర్ గోవర్’వుకోసో ఐ తోచ్కా’ అనే పేరుతో స్టోర్లను తెరిచారు. ఇంతకు ముందులానే మెక్‌డొనాల్డ్స్‌ను ఆదరించాలని వినియోగదారులను కోరారు అలెగ్జాండర్ గోవర్. కొత్త లోగోను విభిన్నంగా తీర్చిదిద్దారు.
Also Read
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
మెక్‌డొనాల్డ్స్‌కు 850 రెస్టారెంట్లలో 62వేల మంది ఉద్యోగులు ఉన్నారు. దీంతో ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన నాటి నుంచి రష్యాను విడిచి వెళ్తున్న అతి పెద్ద పాశ్చాత్య సంస్థల జాబితాలో మెక్‌డొనాల్డ్స్ చేరినట్లు అయింది. సైబీరియాలో 25 ఫ్రాంచైజీలను కలిగి ఉన్న అలెగ్జాండర్ గోవర్కే తమ 850 రెస్టారెంట్లను విక్రయించింది మెక్‌డొనాల్డ్స్. మూతపడిన మెక్‌డొనాల్డ్స్ బ్రాంచ్‌లను వేగంగా తెరవడానికి గోవర్ ప్రయత్నిస్తున్నారు. అలెగ్జాండర్ నేతృత్వంలో రష్యాలో త్వరలో మెక్‌డొనాల్డ్స్ రుచులు అందుబాటులో ఉండబోతున్నాయి. మూతబడ్డ 800 పై చిలుకు ఔట్లెట్లలో 200 దాకా నెలాఖరుకల్లా తెరుచుకుంటాయని యాజమాన్యం చెప్తోంది.
అయితే అంతకంటే ముందే రష్యా డేను పురస్కరించుకుని జూన్ 12న అధికారిక లోగోను రిలీజ్ చేశారు. గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక బర్గర్, రెండు ఫ్రెంచ్ ఫ్రైస్ కనిపించేలా డిజైన్ చేసిన లోగోను విడుదల చేశారు. మెక్‌డొనాల్డ్స్‌లో కోకకోలా నిల్వలు పరిమితంగా ఉన్నాయని అందుకే కొత్త కూల్ డ్రింక్స్ కంపెనీని సంప్రదించనున్నట్లు అలెగ్జాండర్ తెలిపారు. 1991వ దశకంలో ప్రారంభమైన మెక్‌డొనాల్డ్స్ మంచి ఆదరణ కలిగిన ఫాస్ట్‌ఫుడ్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది.
తాజావార్తలు
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
-
Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!