Massive Fire At Skyscraper in Changsha city: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రల్ చైనా నగరం చాంగ్షా శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్ కంపెనీ చైనా టెలికాం కార్యాలయం ఉన్న 42 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భవనంలోని 12కు పైగా అంతస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే వెంటనే అగ్నిమాపక అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అగ్ని ప్రమాదం కారణంగా నగరంలో నల్లటి పొగ ఏర్పడింది.
Read Also: Ram Charan: ఆస్కార్ రేసులో మెగా పవర్ స్టార్.. తారక్ కు పోటీ..?
పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరగడంతో పైన ఉన్న అంతస్తుల నుంచి శిథిలాలు కిందకు పడ్డాయి. దీంతో భయాందోళనతో జనాలు పరుగులు తీశారు. హునాన్ ప్రావిన్స్ రాజధాని అయిన చాంగ్షా నగరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలో మొత్తం జనాభా కోటి మంది దాకా ఉంది. 218 మీటర్ల ఉన్న 42 అంతస్తుల భవనాన్ని 2000లో నిర్మించారు. గతేడాది జూలై కూడా ఈశాన్య జిలిన్ ప్రావిన్సులోని గోడౌన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా.. 25 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు నెల రోజుల ముందు సెంట్రల్ హెనాన్ ప్రావిన్సులోని ఓ మార్షల్ ఆర్ట్స్ స్కూలులో అగ్నిప్రమాదం జరిగి 18 మంది పిల్లలు మరణించారు. 2017లో బీజింగ్ లో ఓ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగడంతో 24 మంది మరణించారు. 2010లో 28 అంతస్తుల షాంఘై హౌసింగ్ బ్లాక్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి 58 మంది చనిపోయారు.
https://twitter.com/lengyer/status/1570689003296550912
这是机房炸了吗?🤔 pic.twitter.com/fw4r3Q6XRh
— 希佩尔海军上当号 (@MavericksGooose) September 16, 2022