NTV Telugu Site icon

Mark Zuckerberg: ట్రంప్ తెగువ నాలో స్ఫూర్తిని నింపింది..

Jukar Barg

Jukar Barg

Mark Zuckerberg: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పై ఇటీవల జరిగిన కాల్పుల ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. పెన్సిల్వేనియాలోని ప్రచార ర్యాలీలో దుండగుడు జరిపిన కాల్పుల్లో.. ట్రంప్‌ కుడి చెవి పైభాగం నుంచి ఓ తూటా దూసుకుపోయింది. రక్తమోడుతున్న గాయంతో వేదికపై నుంచి దిగుతూ ట్రంప్‌ పిడికిలి బిగించి ‘..ఫైట్‌’ అని గట్టిగా ఆరిచాడు. ఈ ఘటనపై తాజాగా మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ రియాక్ట్ అయ్యారు.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ధైర్యాన్ని ప్రశంసించారు.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

ఇక, ట్రంప్ ఫొటోపై మెటా సీఈవో జుకర్‌బర్గ్‌ స్పందిస్తూ.. నా జీవితంలో చూసిన అత్యంత అరుదైన దృశ్యం ఇది అన్నారు. ఆ సమయంలో ఆయన చూపిన తెగువ చాలా స్ఫూర్తిని కలిగించిందన్నారు. ఒక అమెరికన్‌గా ఎవరైనా ఆ పోరాటంతో భావోద్వేగానికి గురి కావాల్సిందేనన్నారు. అందుకేనేమో చాలా మంది ఆయనను ఇష్టపడతారని ట్రంప్ ని ప్రశంసలు కురిపించారు. అయితే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.. రాజకీయాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో ఏ అభ్యర్థికి తాను సపోర్టు ఇచ్చినట్లు కాదని మార్గ్ జుకర్ బర్గ్ పేర్కొన్నారు.

Read Also: Uttarpradesh : దారుణంగా కొట్టిన స్టూడెంట్.. ఐసీయూలో చేరిన టీచర్

అయితే, కాల్పుల ఘటన తర్వాత టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌తో సహా చాలామంది ప్రముఖులు డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతు పలికారు. కాగా, ఇటీవల ట్రంప్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడిగా గెలిస్తే.. టిక్‌టాక్‌ను నిషేధించను.. అలా చేయడం వల్ల మెటా ప్రయోజనం పొందుతుందన్నారు. ఈ పరిణామాల మధ్య జుకర్‌బర్గ్‌ ఆయనను ప్రశంసించడం ప్రాధాన్యత సంతరించుకుంది.