రక్తమోడుతున్న గాయంతో వేదికపై నుంచి దిగుతూ ట్రంప్ పిడికిలి బిగించి ‘..ఫైట్’ అని గట్టిగా ఆరిచాడు. ఈ ఘటనపై తాజాగా మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ రియాక్ట్ అయ్యారు.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ధైర్యాన్ని ప్రశంసించారు.
Trump Rally Shooting: పెన్సిల్వేనియాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ సందర్భంగా కాల్పులు జరిపిన సంఘటనలో ఒకరు మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ట్రంప్ కుడి చెవి పైభాగంలో బుల్లెట్ దూసుకుపోయింది.