Site icon NTV Telugu

Earthquake: ఇజ్రాయెల్ దాడుల ఎఫెక్ట్.. ఇరాన్‌లో భూకంపం.. 4.1గా నమోదు

Earthquake

Earthquake

బాంబులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. ఇజ్రాయెల్, అమెరికా ఎడాపెడా దాడులు చేస్తోంది. గత శనివారం నుంచి ఏకధాటిగా దాడులు చేస్తోంది. దీంతో ఇరాన్‌లో బీభత్సం జరుగుతోంది. తాజాగా టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో భూకంపం సంభవించింది. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌లో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లుగా నివేదికలు లేవు.

USGS డేటా ప్రకారం.. శనివారం ఉదయం బందర్ అబ్బాస్‌కు పశ్చిమాన 74 కిలోమీటర్ల దూరంలో… 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. 4.1 తీవ్రతతో వచ్చే భూకంపాన్ని తేలికపాటి లేదా మితమైన భూకంపంగా పరిగణిస్తారు. భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న నివాసితులకు స్వల్పంగా ప్రకంపనలను సంభవించి ఉండవచ్చు.. పెద్దగా నష్టాన్ని కలిగించవు. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయలేదు.

మంగళవారం కూడా దక్షిణ ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం 10 కి.మీ లోతులో సంభవించింది. స్థానిక సమయం ఉదయం 10:24 గంటలకు నమోదైంది.

ఫిబ్రవరి 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని హతమార్చాయి. ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు నేలరాలిపోయారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్, అమరికాకు మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. దీంతో పశ్చిమాసియా ప్రస్తుతం అగ్నిగుండంగా మారింది.

ఇది కూడా చదవండి: US-Israel-Iran Tensions: బాంబులు.. క్షిపణులు.. యుద్ధాలు..! భూమి వాతావరణానికి పెరుగుతున్న ముప్పు.. మరణాలు పెరుగుతాయా?

ఇరాన్ సైన్యం తుడుచుకు పెట్టుకుపోయిందని… వారి నావికాదళం కూడా పోయిందని.. అలాగే వారి కమ్యూనికేషన్లు కూడా దెబ్బతిన్నట్లుగా ట్రంప్ తెలిపారు. నాయకులు కూడా పోయారని పేర్కొన్నారు. ఇరాన్ దగ్గర 32 నౌకలు ఉన్నాయని.. మొత్తం సముద్రపు అడుగు భాగంలో ఉన్నాయని తెలిపారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోయింత వరకు చర్చలు జరపబోమని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. ఎలాంటి చర్చలు జరపబోమని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Iran-Israel: ఇరాన్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ దాడి.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు

Exit mobile version