‘మా’ కాంట్రవర్సీ : జైలుకెళ్ళాల్సిన వాళ్ళు… విష్ణు సంచలన ఆరోపణలు

టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు సంబంధించిన ఎన్నికల విషయం వేడెక్కుతోంది. అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ నెలకొంది. తాజాగా మంచు విష్ణు చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మూవీ ఆర్టిస్ట్ ల మధ్య యూనిటీ లేదని ఆయన అన్నారు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, దాసరి నారాయణరావు చెప్తే అందరూ విన్నారని, దాసరి పోయాక ఇండస్ట్రీలో కొరత ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ కి పెద్దదిక్కు అనేది లేకుండా పోయిందని, సినిమా పెద్దలు అందరూ కలిసి ఏకగ్రీవంగా ‘మా’కు ఏదైనా మంచి చేద్దాం అంటే నేను కూడా కచ్చితంగా వింటాను అంటూ చెప్పుకొచ్చారు. ‘మా’ భవనం అనేది తన ప్రధాన ఎజెండా కాదని, ఆర్టిస్టులకు సంబంధించిన సమస్యలు, ప్రొడక్షన్ సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఆర్టిస్టుల సంఘం అధ్యక్షులు తెలుగు వాళ్లు కావాలని తాను అనలేదని, కానీ మెంబర్లు కాని వాళ్లు మాత్రం పోటీ చేయొద్దని వెల్లడించారు.

Read Also : పోర్నోగ్రఫీ కేసు… రాజ్ కుంద్రా బిగ్గెస్ట్ కాంట్రవర్సీలు!

అంతేకాకుండా మెంబర్లు కాని వాళ్లకు సినీ పరిశ్రమలో అవకాశాలు ఇవ్వకూడదు అని అన్నారు. ‘మా’ కోసం ఇంకా ఎవరూ పోటీ చేయకముందే తనను పోటీ చేయమని కొందరు పెద్దలు సూచించారని అంటూనే ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న గొడవలను తాను బయట పెట్టనని అన్నారు. మా ఎన్నికల గురించి అందరూ మాట్లాడడం ఆపేయాలని, ఇక్కడ ఏదో బీభత్సం జరిగిపోతుందని అందరూ అనుకుంటున్నారు అని ఆయన అన్నారు. అధ్యక్ష పదవిలో ఉన్నా లేకపోయినా ‘మా’ భవనాన్ని నిర్మిస్తానని, దానికి బాలయ్య కూడా సాయం చేస్తాను అన్నాడని చెప్పుకొచ్చారు. ఇక కొందరు కరోనా కష్టకాలంలో సాయం చేసి టామ్ టామ్ చేసుకుంటున్నారని, కానీ ఇండస్ట్రీ లో ఎంతోమంది అలా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు అని, మంచి చేసినప్పుడు ప్రచారం చేస్తే అది ఇంకొందరికి స్ఫూర్తి అవుతుందని, కానీ వాళ్లకు వాళ్లే ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. అలాగే గతంలో జైలుకెళ్లాల్సిన కొంతమందిని ఎవరు కాపాడారో వాళ్ళని అడిగితేనే తెలుస్తుందని, వాళ్ళు శృతి మించితే పేర్లు బయట పెట్టాల్సి వస్తుందని మంచు విష్ణు గట్టిగానే హెచ్చరించారు. ఆయన ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఇప్పుడు అంతా జైలుకెళ్లాల్సిన వాళ్ళు ఎవరూ అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-