Macron-Meloni Kiss: ఇటలీ ప్రధాని మెలోని బుగ్గపై ముద్దు పెట్టిన మాక్రాన్.. వీడియో వైరల్
- ఫ్రాన్స్‌లో ఇటలీ ప్రధాని మెలోని పర్యటన
- మెలోని బుగ్గపై ముద్దు పెట్టిన మాక్రాన్
- అసౌకర్యానికి గురైన మెలోని
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఫ్రాన్స్ పర్యటనకు వచ్చారు. అయితే మెలోనికి స్వాగతం పలికేందుకు నేరుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఎదురొచ్చారు. మెలోని కారులోంచి దిగగానే.. మాక్రాన్ దగ్గరకు వెళ్లి కౌగిలించుకుని ఎడాపెడా ముద్దులు పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఒకింత మెలోని అసౌకర్యానికి గురైనట్లు కనిపించింది. అంతేకాకుండా లోపలికి తీసుకెళ్లే క్రమంలో మెలోని నడుంపై చేయి వేసేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో పరిస్థితిని గమనించి మెలోని షేక్ హ్యాండిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. దీంతో ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడి చేయడంతో పాటు హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో గ్యాస్, చమురు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఐరోపా దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇక యుద్ధంలో సహకరించలేదని ట్రంప్ ఐరోపా దేశాలపై విరుచుకుపడుతున్నారు. ఐరోపా దేశాలు పిరికి దేశాలంటూ ఎద్దేవా చేస్తున్నారు.
Also Read
- Trump-Leavitt: ‘ఆమె నా కంటే ఎక్కువగా పిల్లలనే ప్రేమిస్తుంది’.. ట్రంప్ చమత్కారం
- AI Weight Loss Plan: AI డైట్ ప్రమాదకరంగా మారిందా? 45 రోజుల్లో 20 కిలోలు తగ్గి ఐసీయూకు!
- Trump: తేడాలు చేస్తే ఒమన్‌ను కూడా లేపేస్తాం.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
- Trump: ఇరాన్‌కు ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు దక్కనివ్వను.. ట్రంప్ శపథం
ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఐరోపా దేశాలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. దాదాపు 40 దేశాలతో చర్చించనున్నారు. ఈ క్రమంలో ఇటలీ ప్రధాని మెలోని ఫ్రాన్స్‌కు వచ్చారు. అయితే ఆమెకు స్వాగతం పలికే క్రమంలో మాక్రాన్ మరింత హద్దులు దాటి ఎడాపెడా ముద్దులు పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో మెలోని అసౌకర్యానికి గురయ్యారు.
అయితే ఈ వీడియోపై ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలైన కామెంట్లు వస్తున్నాయి. మాక్రాన్ తన భార్యను మరిచిపోయినట్లుగా కనిపిస్తోందని.. విమానంలో మాక్రాన్‌పై భార్య దాడి విషయాన్ని గుర్తుచేశాడు. ఇదొక కొత్త రకమైన దౌత్యం అంటూ మరొకరు రాసుకొచ్చారు. ఐరోపా దేశాల్లో సర్వసాధారణంగా ఇలాంటి పలకరింపు కనిపిస్తోందని ఇంకొకరు పేర్కొన్నారు.
French President Emmanuel Macron and Italian Prime Minister Giorgia Meloni shared a rather awkward and unusual hug right in front of the cameras.
The video quickly went viral online. pic.twitter.com/NQHnhRmDEt
— NEXTA (@nexta_tv) April 17, 2026
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!