Kim Jong Un: కిమ్ అరాచకం.. కోరికలు తీర్చడం కోసం ప్రతీ ఏడాది 25 మంది వర్జిన్ అమ్మాయిలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kim Jong Un: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను ఎంత క్రూరుడో ప్రపంచానికి మొత్తం తెలుసు. చిన్న చిన్న నేరాలకు నిర్దాక్షిణ్యంగా శిక్షలు విధించడం కిమ్ స్టైల్. ఇక అక్కడ ఉండే వింతవింత రూల్స్ మరే దేశంలో కనిపించవు. తనను తన తండ్రి, తాతను దేవుడిగా ప్రజలు పూజించాలి తప్పితే, మరే దేవుడినైనా, మరేదైనా మతాన్ని అవలంభిస్తే ఇక మరణశిక్షే గతి. పూర్తిగా ప్రపంచంతో సంబంధం లేకుండా మరో ప్రపంచంలో అక్కడి ప్రజలు బతుకుతున్నారు.
ప్రజలు ఆకలి కేకలతో చనిపోతున్నా కూడా కిమ్ జోంగ్ ఉన్ మాత్రం అణ్వాయుధాల పరుగులో ముందున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా కిమ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న యోన్మీ పార్క్ అనే యువతి కిమ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు. కిమ్‌ని సంతృప్తి పరిచేందుకు అందమైన అమ్మాయిలతో కూడిన ఓ ‘‘ప్లెజర్ స్వ్కాడ్’’ అనే గ్రూపు ఉంటుందని, ప్రతీ ఏడాది అందమైన 25 మంది వర్జిన్ అమ్మాయిలను కిమ్ ఎంచుకుంటారని పార్క్ తెలిపింది. ముక్యంగా మహిళల రూపం, రాజకీయ విధేయత ఆధారంగా వారిని ఎంపిక చేస్తారని చెప్పింది. కిమ్ ప్లెజర్ స్వ్కాడ్ కోసం తాను రెండు సార్లు ఎంపికైనప్పటికీ, తన కుటుంబ స్థితి ఆధారంగా తనను చేర్చుకోలేదని చెప్పారు.
Also Read
- Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్‌ను వీడనున్న కింగ్ చార్లెస్!
- China-Pakistan: పాకిస్తాన్‌తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్‌పింగ్.
- France: ఫ్రాన్స్‌లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
Read Also: Hebah Patel : అబ్బా.. హెబ్బా అందాలు అదరహో..
‘‘వారు అందమైన అమ్మాయిల కోసం స్కూళ్లను సందర్శిస్తారు, ప్రతీ క్లాస్ రూంని వెతుకుతారు. ఎవరైనా అందంగా ఉంటే, అధికారులు వారి కుటుంబ స్థితి, రాజకీయ స్థితిని తెలుసుకుంటారు. ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న కుటుంబ సభ్యులు లేదా దక్షిణ కొరియాతో సంబంధం, ఇతర దేశాల్లో బంధువులు ఉన్న అమ్మాయిలను అందులోంచి తొలగిస్తారు. అమ్మాయిలను ఎంపిక చేసుకున్న తర్వాత, వారు వర్జినిటీని చెక్ చేసేందుకు వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల సమయంలో చిన్న మచ్చ కూడా అనర్హతకు దారి తీస్తుంది. కఠినమైన పరీక్షల తర్వాత ఉత్తర కొరియాలోని కొంతమంది అమ్మాయిలను మాత్రమే రాజధాని ప్యాంగ్యాంగ్‌కి పంపుతారు. వారు అక్కడ కిమ్ కోరికలను తీరుస్తారు’’ అని తప్పించుకుని దేశం వదిలి వెళ్లిన పార్క్ వెల్లడించారు.
ఈ ప్లెజర్ స్వ్కాడ్‌ని మూడు గ్రూపులుగా విభజిస్తారని, ఒకటి మసాజ్, రెండోది సాంగ్స్, డ్యాన్స్ కోసం, మూడో గ్రూపు కిమ్ లైంగిక కోరికలు, ఇతర అత్యున్నత అధికారుల కోరికలను తీర్చడం అని చెప్పారు. అత్యంత అందంగా ఉన్న అమ్మాయిలును నియంతకు సేవ చేయడానికి ఎంపిక చేయబడతారని, ఇతర దిగువ స్థాయి జనరల్స్, రాజకీయ నాయకుల్ని సంతృప్తి పరిచేందుకు మరికొందరు కేటాయించబడతారని చెప్పింది. యువతులు 20 ఏళ్లలోకి చేరగానే వీరి పదవి కాలం ముగుస్తుందని, వీరిలో కొందరు అమ్మాయిలు తరుచుగా కిమ్ బాడీగార్డుల్ని వివాహం చేసుకుంటారని నివేదిక చెప్పింది.
ఈ ప్లెజర్ స్వ్కాడ్ 1970ల నాటి నుంచి ఉంది. ఈ వ్యవస్థ కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్-2 కాలం నాటిది. లైంగిక సంబంధాలు కలిగి ఉండటం చావు లేకుండా అమరత్వాన్ని ఇస్తుందని అతను నమ్మాడు. అయినప్పటీకీ 2011లో అతను మరణించాడు. 70 ఏళ్ల వయసులో అతను మరణించిన తర్వాత కూడా ఈ స్వ్కాడ్ ఇంకా కొనసాగుతూ, కిమ్ అరాచకాలకు యువతులు బలవుతూనే ఉన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
-
Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్‌గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!