Kenya Pastor Makenzi Nthenge Arrested After Followers Allegedly Starve To Death: ఓవైపు ప్రపంచం మొత్తం టెక్నాలజీ పరంగా ముందుకు దూసుకెళ్తుంటే.. కొన్ని చోట్ల మాత్రం మూఢనమ్మకాలు ఇంకా ప్రబలుతూనే ఉన్నాయి. దేవుడిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కొందరు వ్యాపారంగా మలచుకుంటున్నారు. ప్రజల్ని ఇంకా అంధకారంలో నెట్టేస్తున్నారు. తాము చెప్పిందే ఆటగా ఆడుతున్న వారిని టార్గెట్ చేసుకొని.. అఘాయిత్యాలకూ పాల్పడుతున్నారు. తాజాగా ఓ చర్చ్ లీడర్ అయితే.. అంతకుమించిన నేరానికే పాల్పడ్డాడు. ఆకలితో చస్తే జీసస్‌ని కలిసే సౌభాగ్యం లభిస్తుందని చెప్పి.. అమాయకపు ప్రజల ప్రాణాల్ని బలి తీసుకున్నాడు. ఈ ఘటన కెన్యాలోని మలిండి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Ajit Pawar: ఇద్దరికి మించి పిల్లలుంటే, పోటీకి అనర్హులు.. అజిత్ పవార్ షాకింగ్ కామెంట్స్
మెకెన్జీ ఎన్తెంగే అనే ఒక చర్చ్ లీడర్.. ‘మీట్ జీసస్’ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించాడు. ఆమరణ నిరాహార దీక్ష చేసి మృతి చెందితే.. జీసస్‌ని కలిసే అదృష్టం దక్కుతుందని అతడు తన ఫాలోవర్లకు చెప్పాడు. ఇక అప్పటి నుంచి క్రిస్టియన్ కల్ట్ సభ్యులు.. అతను చెప్పినట్టు ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మలిండి టౌన్‌కి సమీపంలో ఉన్న 800 ఎకరాల ప్రాంతంలో.. 47 మృతదేహాలు లభ్యమయ్యాయి. వాళ్లంతా ఆకలితో మరణించినట్టు విచారణలో తేలింది. ఆ ఏరియాని వాళ్లు సీజ్ చేశారు. ఈ నెల ప్రారంభంలోనూ.. గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చిలో నిరాహార దీక్షతో మరణిస్తే స్వర్గానికి వెళ్తామని, జీసన్ని కలిసే అదృష్టం లభిస్తుందని, తద్వారా తాము ఆకలితో చనిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పిన సభ్యుల్లో 15 మందిని పోలీసులు కాపాడారు.
Operation Kaveri: ఆపరేషన్ కావేరి షురూ.. సుడాన్ పోర్టుకి తరలి వస్తున్న ఇండియన్స్
అయితే.. నలుగురు సభ్యులు మాత్రం ఆసుపత్రికి చేరేలోపే మృతి చెందారు. దీని వెనుక మెకెన్జీ ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు.. అతడ్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న అతడు కూడా ఆహారం గానీ, కనీసం నీళ్లు కూడా తీసుకోవడం లేదని తెలిసింది. గత నాలుగు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. కాగా.. కెన్యా ఒక మతపరమైన దేశం. ఇక్కడ గతంలోనూ ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు.. మెకెన్జీ ఇప్పటికే పలుసార్లు అరెస్ట్ అయ్యాడు. అయితే.. ఈసారి అతడ్ని విడిచిపెట్టొద్దన్న స్థానిక లీడర్లు కోర్టుని కోరుతున్నారు.