Kaylin Gillis Shot Dead After Friend Pulled Into Wrong Driveway: అగ్రరాజ్యం అమెరికాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. పొరపాటున తన డ్రైవ్‌వేలో కారు నడిపిన పాపానికి.. ఒక ఇంటి యజమాని ఓ అమ్మాయిని దారుణంగా కాల్చి చంపాడు. అన్యాయంగా 20 ఏళ్ల యువతి ప్రాణాలను బలిగొన్నాడు. అతడ్ని సెకండ్ డిగ్రీ హత్య చార్జ్‌పై పోలీసులు అరెస్ట్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కేలిన్ గిల్లీస్ అనే 20 ఏళ్ల యువతి మరో ఇద్దరితో కలిసి.. కారులో తన స్నేహితుడి ఇంటికి బయలుదేరింది. హెబ్రాన్ పట్టణంలో తన స్నేహితుడి ఇంటికి వెతుకుతున్న క్రమంలో.. అనుకోకుండా కెవిన్ మోనహన్ (65) అనే వ్యక్తి డ్రైవ్‌వేలోకి వెళ్లారు. తమ తప్పు గ్రహించిన ఆ ముగ్గురు స్నేహితులు.. తమ కారుని తిప్పబోతున్నారు. సరిగ్గా అదే సమయంలో కెవిన్ తన వరండాలో నుంచి బయటకొచ్చి.. తుపాకీ తీసి, రెండు షాట్లు కాల్చాడు. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ కేలిన్ గిల్లీస్ శరీరంలోకి దూసుకెళ్లిపోవడంతో.. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
CM YS Jagan: మూలపేట.. మూలనఉన్న పేట కాదు.. అభివృద్ధికి మూలస్తంభం…
ఆమె స్నేహితులు పోలీసులకు ఈ ఘటనపై సమాచారం అందించగా.. వాళ్లు వెంటనే రంగంలోకి దిగి, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు సెకండ్ డిగ్రీ హత్యకు పాల్పడ్డాడని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై షెరిఫ్ జెఫ్రీ మర్ఫీ మాట్లాడుతూ.. ఇదో విచారకరమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్నేహితుడి ఇల్లు వెతికే క్రమంలో వాళ్లు పొరపాటున కెవిన్ మోనహన్ డ్రైవ్ వేలోకి వెళ్లారని, కానీ అతడు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి 20 ఏళ్ల కేలిన్ ప్రాణాలు తీసుకున్నాడని తెలిపారు. ఇప్పుడిప్పుడే ఆ యువతి జీవితం చూడటం ప్రారంభించిందని, ఆమెకు జీవితంలో చూడాల్సింది ఇంకా ఎంతో ఉందని, కానీ ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని చెప్పారు. ఇదే సమయంలో కేలిన్ కజిన్ హెలీ యూస్టిస్ మాట్లాడుతూ.. ‘‘ఆమెకు ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడతను ఎంతలా బాధపడుతున్నాడో నేను మాటల్లో వర్ణించలేను. ఆమెకు ఒక పెద్ద కుటుంబం కూడా ఉంది. కానీ.. ఈ దుర్ఘటనలో ఆమె మృతి చెందడం నిజంగా దురదృష్టకరం’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
Spicejet Warning Light: ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో ఊహించని ట్విస్ట్.. వార్నింగ్ లైట్ ఎంత పని చేసింది
కేలిన్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమ అమ్మాయి ఎంతో మంచిదని, అందరికీ ఆదర్శప్రాయురాలని పేర్కొన్నారు. ఆమె ఒక కళాకారణి అని, డిస్నీ అభిమాని అని.. ఫ్లోరిడాలో చదువుకొని ఒక మరీన్ బయోలజిస్ట్ అవ్వాలని కేలిన్ కల అని తెలిపారు. ఇప్పుడు తమ కుటుంబం మునుపటిలా ఉండదని.. ఆమె లేకుండానే జీవించాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. కేలిన్ గిల్లీస్ 2021లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆమె అంత్యక్రియల ఖర్చుల కోసం గోఫౌండ్‌మీ విరాళాలు సేకరించగా.. దాదాపు 100,000 డాలర్లు వచ్చినట్టు తేలింది.