Nobel Prize: కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి దారి.. ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nobel Prize: ప్రపంచంలో అత్యున్నత బహుమతైన ‘నోబెల్ ఫ్రైజ్’ ప్రకటన ప్రారంభమైంది. వైద్యశాస్త్రంలో అత్యున్నత కృషి చేసింనదుగానూ కాటాలిన్ కారిడో, డ్రూ వీస్‌మాన్‌లను నోబెల్ బహుమతిని సోమవారం ప్రకటించారు. మానవాళికి పెనుముప్పుగా మారిని కోవిడ్19ని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ తయారీకి ఇరువురు పరిశోధనలు కీలకమయ్యాయి. వ్యాక్సిన్ తయారీకి మార్గాన్ని సుగమం చేసిన మెసెంజర్ ఆర్ఎన్ఏ(ఎంఆర్ఎన్ఏ) సాంకేతికతపై ఇరువురు పరిశోధలు చేశారు.
ఆధునిక కాలంలో మానవాళి ఎదుర్కొన్న అతిపెద్ద ముప్పుగా ఉన్న కోవిడ్ 19ని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తయారీకి వీరిద్దరు దోహదపడ్డారని జ్యూరీ పేర్కొంది. వైద్యవిభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. మంగళవారం ఫిజిక్స్, బుధవారం కెమెస్ట్రీ, గురువారం సాహిత్యం విభాగాల్లో విజేత పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం నోబెల్ పీస్ ఫ్రైజ్, అక్టోబర్ 9న అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తారు.
Also Read
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
- Iran War: అమెరికాకు ఇరాన్ షాక్.. కూల్చిన F-15E శకలాలను ప్రపంచానికి చూపించింది.!
Read Also: PM Modi: కన్హయ్యలాల్ తల నరికి చంపితే.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది.
ఎంఆర్ఎన్ఏ సాంకేతికతను ఉపయోగించి మొదటిసారిగా ఫైజర్ బయోటెక్, మోడెర్నా కోవిడ్ వ్యాకిన్లను తయారు చేసింది. హంగేరికి చెందిన కారికో, అమెరికాకు చెందిన వీస్‌మాన్ పెన్సిల్వేనియా యూనివర్సిటీలో సహచరులు. వీరు వైద్యశాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు.
బలహీన వైరస్ లేదా వైరస్ ప్రోటీన్ల భాగాలను ఉపయోగించే సాంప్రదాయ వ్యాక్సిన్లలా కాకుండా mRNA వ్యాక్సిన్లు జన్యు అణువులను అందిస్తాయి, దీని ద్వారా రోగనిరోధక కణాలకు ఏ ప్రొటీన్లు తయారు చేయాలో తెలియజేస్తాయి. నిజమైన వైరస్ ని ఎదుర్కొన్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ శిక్షణ ఇస్తుంది. క్యాన్సర్, ఇన్ఫ్లుఎంజా, గుండె వైఫల్యం వంటి వ్యాధులు, అనారోగ్యాలకు ఇతర చికిత్సలను అభివృద్ధి చేయడానికి కారికో, వీస్‌మాన్ యొక్క mRNA సాంకేతికత ఇప్పుడు ఉపయోగించబడుతోంది.
తాజావార్తలు
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
-
PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
-
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!