Donald Trump: ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్‌‌ను టార్గెట్ చేసిన ట్రంప్..!

  • భారత సంతతి కాష్ పటేల్‌ను టార్గెట్ చేసిన ట్రంప్..
  • ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించే అవకాశం..
  • వరస వివాదాల్లో చిక్కుకున్న కాష్ పటేల్..
Us Polictics

Us Polictics

Donald Trump: భారత సంతతికి చెందిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ పదవిపై కత్తి వేలాడుతోంది. ట్రంప్ కాష్ పటేల్‌ను ఆ పదవిని నుంచి తొలగించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మద్యపాన వివాదం, ఇరాన్ హ్యాకర్లు కాష్ పటేల్ ఈమెయిల్ హ్యాక్ చేయడం వంటి ఘటనల తర్వాత ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ వార్తాపత్రిక పొలిటికో ప్రకారం.. ఆయన పదవి కొల్పోవచ్చన తెలుస్తోంది. వాషింగ్టన్‌లోని వైట్ హౌజ్ కరస్పాండెంట్స్ డిన్నర్ సమీపంలో కాల్పులు ఘటన జరిగిన తర్వాత ఈ నివేదిక వెలుగులోకి వచ్చింది.

బహిరంగంగా మద్యపానం సేవించినందుకు తాను రెండుసార్లు అరెస్ట్ అయినట్లు కాష్ పటేల్ అంగీకరించినట్లు ఇటీవల ‘ది ఇంటర్‌సెప్ట్’ వెబ్ సైట్ నివేదించింది. కాష్ పటేల్ మత్తు వచ్చేంత వరకు తాగుతాడని ది అట్లాంటిక్ పత్రిక కూడా ఒక నివేదికలో పేర్కొంది. ఈ నివేదికపై కాష్ పటేల్ 250 మిలియన్ డాలర్లు(రూ.2000 కోట్లు) నష్టపరిహారం కోసం కేసు వేశాడు. మరోవైపు, మార్చిలో ఆయన ఈమెయిల్‌ను ఇరాన్ హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఆయన బయోడెటాను, ఫోటోను విడుదల చేశారు. శత్రుదేశం ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఈమెయిల్ హ్యాక్ చేయడం సంచలనంగా మారింది.

Read Also: FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్‌గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..

ఇక కాష్ పటేల్ పామ్ బాండిని తన గురువుగా భావిస్తాడు. యూఎస్ అటార్నీ జనరల్‌గా ఉన్న బాండిని ట్రంప్ ఏప్రిల్ 2న తొలగించారు. తన రాజకీయ ప్రత్యర్థులపై విచారణ వేగవంతం చేయడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ ట్రంప్ ఈ పనిచేశారు. ఇక ఆమె జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైళ్లను సరిగా నిర్వహించలేదనే ఆగ్రహం ట్రంప్‌లో ఉంది. బాండీ తర్వాత ట్రంప్ తొలగించేది పటేల్‌నే అని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు, కొందరు ఎఫ్‌బీఐ ఏజెంట్లు కాష్ పటేల్, పామ్ బాండిపై న్యాయపరమైన చర్యలకు దిగారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేయడానికి ట్రంప్ ప్రయత్నించాడనే ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఈ ఏజెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించడం వివాదంగా మారింది. 2024 ఎన్నికలలో MAGA (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) ఉద్యమంలో కాష్ పటేల్ కీలకంగా వ్యవహరించారు. ట్రంప్‌కు గట్టి మద్దతుదారుగా ఉన్నారు. ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత కాష్ పటేల్ ఎఫ్‌బీఐ చీఫ్ అయ్యారు.