Donald Trump: ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్‌ను టార్గెట్ చేసిన ట్రంప్..!
- భారత సంతతి కాష్ పటేల్‌ను టార్గెట్ చేసిన ట్రంప్..
- ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించే అవకాశం..
- వరస వివాదాల్లో చిక్కుకున్న కాష్ పటేల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: భారత సంతతికి చెందిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ పదవిపై కత్తి వేలాడుతోంది. ట్రంప్ కాష్ పటేల్‌ను ఆ పదవిని నుంచి తొలగించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మద్యపాన వివాదం, ఇరాన్ హ్యాకర్లు కాష్ పటేల్ ఈమెయిల్ హ్యాక్ చేయడం వంటి ఘటనల తర్వాత ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ వార్తాపత్రిక పొలిటికో ప్రకారం.. ఆయన పదవి కొల్పోవచ్చన తెలుస్తోంది. వాషింగ్టన్‌లోని వైట్ హౌజ్ కరస్పాండెంట్స్ డిన్నర్ సమీపంలో కాల్పులు ఘటన జరిగిన తర్వాత ఈ నివేదిక వెలుగులోకి వచ్చింది.
బహిరంగంగా మద్యపానం సేవించినందుకు తాను రెండుసార్లు అరెస్ట్ అయినట్లు కాష్ పటేల్ అంగీకరించినట్లు ఇటీవల ‘ది ఇంటర్‌సెప్ట్’ వెబ్ సైట్ నివేదించింది. కాష్ పటేల్ మత్తు వచ్చేంత వరకు తాగుతాడని ది అట్లాంటిక్ పత్రిక కూడా ఒక నివేదికలో పేర్కొంది. ఈ నివేదికపై కాష్ పటేల్ 250 మిలియన్ డాలర్లు(రూ.2000 కోట్లు) నష్టపరిహారం కోసం కేసు వేశాడు. మరోవైపు, మార్చిలో ఆయన ఈమెయిల్‌ను ఇరాన్ హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఆయన బయోడెటాను, ఫోటోను విడుదల చేశారు. శత్రుదేశం ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఈమెయిల్ హ్యాక్ చేయడం సంచలనంగా మారింది.
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
Read Also: FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్‌గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
ఇక కాష్ పటేల్ పామ్ బాండిని తన గురువుగా భావిస్తాడు. యూఎస్ అటార్నీ జనరల్‌గా ఉన్న బాండిని ట్రంప్ ఏప్రిల్ 2న తొలగించారు. తన రాజకీయ ప్రత్యర్థులపై విచారణ వేగవంతం చేయడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ ట్రంప్ ఈ పనిచేశారు. ఇక ఆమె జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైళ్లను సరిగా నిర్వహించలేదనే ఆగ్రహం ట్రంప్‌లో ఉంది. బాండీ తర్వాత ట్రంప్ తొలగించేది పటేల్‌నే అని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు, కొందరు ఎఫ్‌బీఐ ఏజెంట్లు కాష్ పటేల్, పామ్ బాండిపై న్యాయపరమైన చర్యలకు దిగారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేయడానికి ట్రంప్ ప్రయత్నించాడనే ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఈ ఏజెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించడం వివాదంగా మారింది. 2024 ఎన్నికలలో MAGA (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) ఉద్యమంలో కాష్ పటేల్ కీలకంగా వ్యవహరించారు. ట్రంప్‌కు గట్టి మద్దతుదారుగా ఉన్నారు. ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత కాష్ పటేల్ ఎఫ్‌బీఐ చీఫ్ అయ్యారు.
తాజావార్తలు
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు