NTV Telugu Site icon

Kamala Harris: అక్రమ వలసలపై కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు..

Haris

Haris

Kamala Harris: ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలాహారిస్‌ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అరిజోనాలోని డగ్లస్‌కు చెందిన యూఎస్- మెక్సికో సరిహద్దు ప్రాంతాన్ని డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌ సందర్శించారు. ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. దేశంలోకి అక్రమ వలసలను నివారించేందుకు అమెరికా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇమిగ్రేషన్‌ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాని చెప్పింది. ఎన్నోఏళ్లుగా యూఎస్‌లో నివాసముంటున్న ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని వలసదారులకు పౌరసత్వం కల్పించడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమలా హారిస్ వెల్లడించారు.

Read Also: Bandi Sanjay: మమ్మీ, డాడీ కల్చర్ మనకొద్దు… అమ్మానాన్నే ముద్దు..

ఇక, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న నాలుగేళ్లలో విచ్ఛిన్నమైన ఇమిగ్రేషన్ వ్యవస్థను సరి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కమలా హారిస్ ఆరోపించారు. ఇమిగ్రేషన్ ఏజెంట్ల కొరత సమస్యను కూడా పరిష్కరించలేదని విమర్శించింది. విదేశీయులు దేశంలోకి ప్రవేశించడానికి ఎలాంటి చట్టబద్ధమైన మార్గాలను రూపొందించలేదన్నారు. ఈవిధంగా రాజకీయాలు చేయడానికి ప్రజలను ఉపయోగించుకునే వారికంటే దేశ భద్రత గురించి శ్రద్ధ వహించే వారికి ఎన్నికల్లో ప్రజలు తమ సపోర్టు ఇవ్వాలని ఆమె కోరింది. మాజీ సరిహద్దు రాష్ట్ర అటార్నీ జనరల్‌గా విధులు నిర్వహించిన తనకు సరిహద్దు దగ్గర భద్రత, చట్టాలను అమలు చేయడం లాంటి వాటిపై అవగాహన ఉందన్నారు. గతంలో తాను తుపాకులు, మాదకద్రవ్యాలు, మానవుల అక్రమ రవాణా లాంటి వాటిపై అంతర్జాతీయ క్రిమినల్ సంస్థలను విచారించినట్లు కమలా హారిస్ తెలిపారు.

Read Also: Suicide Case: దారుణం.. నలుగురు వికలాంగ కూతుళ్లతో సహా తండ్రి ఆత్మహత్య.!

కాగా, కమలా హారిస్‌ వ్యాఖ్యలపై రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. నాలుగేళ్లుగా సరిహద్దు వద్దకు వెళ్లని హారిస్‌కు ఎన్నికల వేళ అక్రమ వలసల సమస్య గుర్తొచ్చిందాని క్వశ్చన్ చేశారు. సరిహద్దులకు వెళ్లి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు.. ఆ సమస్య గురించి ఆలోచించే వారే అయితే నాలుగేళ్లుగా సరిహద్దు దగ్గరకు వెళ్లకుండా ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. హింసాత్మక మూకలు అమెరికాలో ప్రవేశించి ఇక్కడ హత్యలు, అత్యాచారాలు చేస్తున్నా.. ఆమె పట్టించుకోలేదన్నారు. చిన్న పట్టణాలను అన్నింటినీ కమలా హారిస్ శరణార్థుల శిబిరాలుగా మార్చేశారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.