NTV Telugu Site icon

Elon Musk: వచ్చే ఎన్నికల్లో ట్రూడో ఓడిపోవడం ఖాయం..కెనడా ప్రధానిపై మస్క్ విమర్శలు

Elon Musk

Elon Musk

Elon Musk: కెనడాలో పార్లమెంటరీ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోపై టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడాలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రధాని ట్రూడో ఓడిపోతారని జోస్యం చెప్పుకొచ్చారు. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించడంలో మస్క్‌ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ట్రూడోను వదిలించుకునేందుకు కెనడాకు సాయం చేయండి అంటూ ఓ యూజర్ ఎలాన్‌ మస్క్‌ను వేడుకున్నారు. దీంతో ‘అతడు రాబోయే ఎన్నికల్లో జస్టిన్ ట్రూడో ఓడిపోతాడు అని సదరు యూజర్‌కు రిప్లై ఇచ్చాడు.

Read Also: WPL 2025: 24 మంది క్రికెటర్లను వదిలేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్, రిలీజ్ లిస్ట్ ఇదే!

కాగా, కెనడా పార్లమెంట్‌లో 338 పార్లమెంట్‌ స్థానాలు ఉన్నాయి. జస్టిన్ ట్రూడో లిబరల్‌ పార్టీకి 153 మంది సభ్యులు ఉండగా.. ప్రధాని మిత్రపక్షాల సపోర్టుతో ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని నడిపించారు. అయితే, ఆయన తీరుపై స్వపక్షంలోనే అసంతృప్తి మొదలైంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలకు చేసే సన్నాహాలు దారణంగా ఉన్నాయని సొంత పార్టీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. ఇక, భారత్‌- కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటీవల హర్థీప్ సింగ్ నిజ్జర్‌ హత్య కేసులో భారత్‌పై ప్రధాని ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆ దేశంలోని మన దేశ దౌత్యవేత్తలను భారత్‌ వెనక్కి రప్పించగా.. ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్‌ సహా ఆరుగురు దౌత్యవేత్తల్ని బహిష్కరించింది.