జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. యూకెలో జీ7 దేశాల శిఖరాగ్ర సదస్తు జరుగుతున్నది. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడితో పాటుగా జీ 7 దేశాల అధినేతలు కూడా పాల్గోనబోతున్నారు. అయితే, ఈ సదస్సు ద్వారా అమెరికా నాటో, యూరోపియన్ మిత్రదేశాలతో మరింత సాన్నిహిత్యం పెంచుకోవడానికి ఉపయోగించుకోబోతున్నది. గత అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అమెరికాకు ప్రాధాన్యత ఇవ్వడంతో నాటో, యూరోపియన్ మిత్రదేశాలు తప్పనిసరి పరిస్థితుల్లో చైనా,రష్యా దేశాలతో సంబంధాలు పెట్టుకోవలసి వచ్చింది. దీంతో ప్రపంచంలో అమెరికా ఖ్యాతి కొంతమేర తగ్గిపోయింది. దీనిని తిరిగి నిలబెట్టి, ప్రపంచంలో తిరిగి పెద్దన్న పాత్రను పూర్తి స్థాయిలో పోషించేందుకు ఈ పర్యటనను ఉపయోగించుకోబోతున్నారు జోబైడెన్. పర్యటనలో జో బైడెన్ మొత్తం 11 మంది దేశాధినేతలను కలవబోతున్నారు. చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు యూరోపియన్ మిత్రదేశాలతో కలిసి సరికోత్త పథకాన్ని రూపోందించబోతున్నట్టు సమాచారం.