Site icon NTV Telugu

JD Vance-Erika kirk: ఎరికా కిర్క్‌ను కౌగిలించుకున్న జేడీ వాన్స్.. ఇంటర్నెట్ షేక్

Jdvance

Jdvance

చార్లీ కిర్క్.. ట్రంప్ సన్నిహితుడు. ఇటీవల దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో చార్లీ కిర్క్ సతీమణి ఎరికా కిర్క్ వెలుగులోకి వచ్చింది. ఇక మరణానంతరం చార్లీ కిర్క్‌కు దేశ అత్యున్నత పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం ప్రకటించింది. ఇటీవల ట్రంప్ చేతుల మీదుగా ఎరికా కిర్క్ అవార్డు అందుకుంది.

ఇది కూడా చదవండి: UK: బ్రిటన్ రాజకుటుంబంలో భారీ కుదుపు.. తమ్ముడు ఆండ్రూను ఇంట్లో నుంచి గెంటేసిన కింగ్ చార్లెస్‌

తాజాగా ఎరికా కిర్క్ తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిస్సిస్సిప్పిలో టర్నింగ్ పాయింట్ యూఎస్ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి జేడీ వాన్స్-ఎరికా కిర్క్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్-ఎరికా కిర్క్ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. చాలా దగ్గరగా సంబంధం పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక జేడీ వాన్స్ మాట్లాడుతూ.. తన భార్య హిందువు అని.. ఏదొక రోజు క్రైస్తవ్యంలోకి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

చార్లీ కిర్క్ ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.

 

Exit mobile version