Japan Roasts China: డ్రాగన్ దేశాన్ని నవ్వులపాలు చేసిన జపాన్.. అణు ఆయుధాలపై లైవ్‌లో మాస్ ర్యాగింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japan Roasts China: సింగపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు వేదికగా చైనా, జపాన్ దేశాల మధ్య దౌత్యపరమైన మాటల యుద్ధం ముదిరింది. ఆసియాలోనే అతిపెద్ద రక్షణ సదస్సు అయిన ‘షాంగ్రి – లా డైలాగ్’లో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి చైనా తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేరుగా చైనా పేరు ఎత్తకుండానే, ఆ దేశ అహంకారాన్ని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టారు. ఈ సదస్సులో జరిగిన ఆసక్తికర పరిణామాలు, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన అంశాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
“అన్ని అణ్వాయుధాలు పెట్టుకుని మమ్మల్ని అంటారా?” జపాన్ రక్షణ మంత్రి సెటైర్లు
జపాన్ అనుసరిస్తున్న వ్యూహాత్మక రక్షణ విధానాలను చైనా విమర్శిస్తూ.. జపాన్ మళ్లీ “నూతన సైనికవాదం” వైపు అడుగులు వేస్తోందని ఆరోపించింది. ఈ ఆరోపణలపై జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఒక్కసారి ఊహించండి.. ఒక దేశం దగ్గర భారీ సంఖ్యలో అణ్వాయుధాలు, ప్రమాదకర వ్యూహాత్మక బాంబర్లు ఉన్నాయి. జపాన్ దగ్గర ఇవేవీ లేవు. అయినా సరే జపాన్ను ‘నూతన సైనికవాదం’ అని ఆ దేశం పిలుస్తోంది.. ఇది వింతగా లేదా?” అంటూ కోయిజుమి చైనాపై బలమైన కౌంటర్ ఇచ్చారు. చైనా పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆయన మాటాలు బీజింగ్‌ను ఉద్దేశించినవేనని స్పష్టంగా అర్థమవుతోందని చెబుతున్నారు విశ్లేషకులు.
Also Read
- US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
శాంతియుత వైఖరి వీడుతున్న టోక్యో.. ఎందుకంటే
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ పూర్తిగా శాంతియుతమైన రక్షణ విధానాన్ని (Pacifist Policy) అవలంబిస్తోంది. అయితే ఇటీవల కాలంలో చైనా తన సైనిక శక్తిని విచ్చలవిడిగా, అపారదర్శకంగా విస్తరిస్తుండటంతో జపాన్ కూడా అలర్ట్ అయింది. జపాన్ ప్రస్తుత ప్రధానమంత్రి సనావో టకైచీ నాయకత్వంలో టోక్యో మరింత చురుకైన రక్షణ విధానాన్ని అవలంబిస్తోంది. ఇందులో భాగంగానే జపాన్ తన రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మానవరహిత సైనిక వ్యవస్థలు (Drones), సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష భద్రత వంటి నూతన సాంకేతికతలపై పెట్టుబడులు పెడుతోంది. చైనా లాగా దొంగచాటుగా కాకుండా, తాము చేసే ప్రతి సైనిక విస్తరణ పూర్తి పారదర్శకతతో కూడుకున్నదని కోయిజుమి స్పష్టం చేశారు.
తైవాన్ వివాదమే అసలు మంట
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తైవాన్ సమస్య ప్రధాన కారణగా మారింది. గతేడాది నవంబర్‌లో జపాన్ ప్రధాని తకైచి ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఒకవేళ చైనా బలవంతంగా తైవాన్ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే.. జపాన్ ఊరుకోదని, సైనిక జోక్యాన్ని పరిశీలిస్తుందని ఆమె హెచ్చరించారు. అప్పటి నుంచి బీజింగ్ – టోక్యోల మధ్య దౌత్యపరమైన సంబంధాలు క్షీణించాయి. “జపాన్ను ప్రపంచమంతా శాంతిని ప్రేమించే దేశంగా గౌరవిస్తుంది. చైనా చేసే తప్పుడు ఆరోపణలు ఈ వాస్తవాన్ని మార్చలేవు” అని జపాన్ రక్షణ మంత్రి నొక్కి చెప్పారు. ఇదే సమయంలో షాంగ్రి – లా డైలాగ్‌కు చైనా కేవలం ఒక చిన్న ప్రతినిధి బృందాన్ని మాత్రమే పంపడం గమనార్హం. చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ వరుసగా రెండో సంవత్సరం కూడా ఈ అత్యంత కీలకమైన సదస్సుకు హాజరుకాలేదు. దీనిపై జపాన్ రక్షణ మంత్రి స్పందిస్తూ.. చైనా రక్షణ అధికారితో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం లేకపోవడంపై తాను తీవ్ర “విచారాన్ని” వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురిపై మరో కేసు
-
Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
ట్రెండింగ్
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!