Site icon NTV Telugu

James Webb Telescope: జెమ్స్ వెబ్ నుంచి అద్భుత ఖగోళ దృశ్యం.. గెలాక్సీల నిర్మాణంపై మరింత సమాచారం

Jemes Webb Telescope

Jemes Webb Telescope

James Webb Telescope Captures Images Of Cartwheel Galaxy: జెమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వాంతరాల్లోని అద్భుతమైన ఫోటోలను భూమికి పంపిస్తోంది. మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న అనేక గెలాక్సీ నిర్మాణాలను, నెబ్యులాలను క్యాప్చర్ చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా చాలా స్పష్టతతో కూడిన అబ్బురపరిచే చిత్రాలను అందిస్తోంది. దీంతో విశ్వం తొలినాళ్లలో గెలాక్సీల నిర్మాణం, నక్షత్రాలు పుట్టుక, బ్లాక్ హోల్స్ గురించిన మరింత సమాచారాన్ని జెమ్స్ వెబ్ అందిస్తోంది. తాజాగా 500 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కార్ట్ వీల్ గెలాక్సీకి సంబంధించిన చిత్రాలను తీసింది. గతంలో హబుల్ టెలిస్కోప్ ఇదే చిత్రాలను తీసినప్పటికీ.. దుమ్ము, ధూళి కారణంగా స్పష్టంగా కనిపించలేదు. అయితే జెమ్స్ వెబ్ తనలోని ఇన్ ఫ్రారెడ్ కెమెరాల సాయంతో అత్యంత స్పష్టమైన చిత్రాలను తీయగలిగింది. గెలాక్సీల మధ్య భాగంలో ఉన్న బ్లాక్ హోల్స్ గురించి, నక్షత్రాల నిర్మాణం గురించి మరింత సమచారాన్ని మానవుడు తెలుసుకునే వీలు కలిగింది.

Read Also: Ayman al-Zawahiri: అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి హతం.. అలాంటిదేం లేదంటున్న తాలిబన్లు

తాజాగా జెమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రంలో పెద్ద స్పైరల్ గెలాక్సీ, మరో గెలాక్సీని వేగం ఢీకొనడంతో ఈ రూపాన్ని సంతరించుకుందని తెలుస్తోంది. కార్ట్ వీల్ అనేది గెలాక్సీలు ఢీకొనడం వల్ల ఏర్పడే అత్యంత అరుదైన దృశ్యం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కార్ట్ వీల్ గెలాక్సీలో మధ్య భాగంలో భారీ ఉష్ణోగ్రతలు, దమ్ము ధూళితో కొత్తగా నక్షత్రాలు ఏర్పడుతున్న విధానాన్ని గమనించవచ్చు. మరోవైపు గెలాక్సీ బాహ్య వలయం పెరుగుతున్న దృశ్యాన్ని గమనించవచ్చు. వెలుపల ఉన్న రింగ్, వాయువులను ఢికొనడం వల్ల కొత్తగా నక్షత్రాలు ఏర్పడుతాయని నాసా తెలిపింది.

Exit mobile version