Jai Shankar: భారత్, చైనా మధ్య సంబంధాలపై జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jai Shankar Says India-China Relations Are Not Normal: భారత్-చైనా సరిహద్దు సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత లేనంతవరకూ.. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి రాలేవని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంపై తాము ఇప్పటికే చైనా నాయకత్వంతో పలుమార్లు చర్చించామని.. సమస్యాత్మక ప్రాంతాల నుంచి సైనికుల ఉపసంహరణ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సభ్యదేశాల విదేశాంగశాఖ మంత్రుల మండలి సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Anasuya: గాలికిపోయే కంపను మళ్లీ తగిలించుకోవడం అవసరమా ‘ఆంటీ’
Also Read
- Russia-Ukraine War: నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
- UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా 'UFO' రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
- Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..
- US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
అంతకుముందు గురువారం.. భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాల సాధారణీకరణ కోసం తూర్పు లడఖ్ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంతో పాటు వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంట శాంతి, ప్రశాంతతను కొనసాగించాల్సిన ఆవశ్యకతను చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్‌కు జైశంకర్ నొక్కి చెప్పారు. ఎస్‌సిఓ సదస్సు సందర్భంగా.. గోవాలోని తాజ్ ఎక్సోటికా రిసార్ట్‌లో ఈ ఇద్దరు విదేశాంగ మంత్రులు దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. అపరిష్కృతమైన సమస్యలను పరిష్కరించడం, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి & ప్రశాంతతను నిర్ధారించడంపై ఈ చర్చ ఉద్దేశమని ఆయన ట్వీట్‌లోనూ పేర్కొన్నారు. ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణ సరిహద్దు వివాదంపై కేంద్రీకృతమైందని, సకాలంలో పరిష్కారం కోసం జైశంకర్ ఒత్తిడి చేశారని ఓ వార్తా సంస్థ పేర్కొంది.
RR vs GT: రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం
గత రెండో నెలల్లో జైశంకర్, క్విన్‌లు ఇలా రెండోసారి సమావేశం అయ్యారు. జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు చైనా విదేశాంగ మంత్రి మార్చిలో భారత్‌కు వచ్చారు. ఆ పర్యటనలో, తూర్పు లడఖ్‌లో కొనసాగుతున్న సరిహద్దు వివాదం భారత్-చైనా సంబంధాలు ‘అసాధారణ’గా మారడానికి కారణమైందని క్విన్‌కు జైశంకర్ తెలియజేశారు.
తాజావార్తలు
-
Train Tickets Rule: ఒక చిన్న తప్పు మీ కన్ఫర్మ్డ్ టికెట్‌ను కోల్పోయేలా చేస్తుంది! ఈ రైల్వే రూల్ తెలుసా?
-
Kalki 2: ‘కల్కి 2’ సీక్వెల్‌పై షాకింగ్ అప్‌డేట్స్!
-
Tollywood Box Office Disasters : కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టని ఈ వారం సినిమాలు
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
IPL 2026 ప్లేఆఫ్స్ రేసు.. ఎస్‌ఆర్‌హెచ్, ఆర్సీబీ పక్కా.. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టుకు టైటిల్ ఖాయమన్న అశ్విన్