NTV Telugu Site icon

Israel-Iran Conflict: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇరాన్‌పై ఇజ్రాయిల్ ప్రతీకార దాడి..?

Israel Iran Conflict

Israel Iran Conflict

Israel-Iran Conflict: నవంబర్‌ 5న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కన్నా ముందే ఇరాన్‌పై ప్రతీకార దాడి చేయాలని ఇజ్రాయిల్ భావిస్తున్నట్లు అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయిల్‌పై ఇరాన్ 200 బాలిస్టిక్ క్షిపణులను ఫైర్ చేసింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్య తర్వాత ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడికి పాల్పడినంది. ఇజ్రాయిల్ లెబనాన్‌లో హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా విరుచుకుపడుతోంది. ఈ సందర్భంలోనే నస్రల్లాని బీరూట్‌లో వైమానికదాడి చేసి చంపేసింది. కీలకమైన హిజ్బుల్లా నాయకులను కూడా ఇజ్రాయిల్ ఎలిమినేట్ చేసింది.

తమపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇజ్రాయిల్ అనుకుంటోంది. ముఖ్యంగా ఇరాన్ చమురు, అణు కేంద్రాలను టార్గెట్ చేయవచ్చనే వాదన వినిపిస్తోంది. నిజానికి ఇజ్రాయిల్ ఎన్నికలతో ఈ అంశం ముడిపడిలేకున్నా.. అమెరికా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో.. ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహూకు తెలుసు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్‌లో అశాంతి, డెమోక్రాట్ల తరుపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలా హారిస్‌కి ప్రతిబంధకంగా మారింది. గాజాలో యుద్ధాన్ని ఆపలేకపోయారని బిడెన్ పరిపాలనపై విమర్శలు వస్తున్నాయి. పరిస్థితిని సరిగా హ్యాండిల్ చేయలేదని రిపబ్లికన్లు విమర్శి్స్తున్నారు. మరికొందురు మాత్రం ఇది మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కి సాయం కావచ్చని భావిస్తున్నారు.

Read Also: Minister Atchannaidu: కేరళ తరహాలో తీర ప్రాంత అభివృద్ధి.. వేట నిషేధ భృతి అమలుకు చర్యలు

మరోవైపు గాజాలో మానవతా పరిస్థితిని మెరుగుపరచాలని ఇజ్రాయిల్‌కి బిడెన్ అడ్మినిస్ట్రేషన్ పిలుపునిచ్చింది. గాజాకు సాయాన్ని పెంచడంతో ఇజ్రాయిల్ విఫలమైంతే ఇది నిరంతర సైనిక సహాయంపై ప్రభావాన్ని చూపిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఒక లేఖలో పేర్కొన్నారు. అయితే, వీటిపై జో బిడెన్ లేదా కమలా హారిస్ సంతకాలు లేవు. ఇజ్రాయిల్, ఇరాన్‌పై దాడి చేసే సమయం ముఖ్యంగా అమెరికాలోని అరబ్ కమ్యూనిటీ ఓట్లపై ప్రభావం చూపిస్తుందని, ఈ కమ్యూనిటీకి కేంద్రంగా ఉన్న మిచిగాన్ వంటి స్వింగ్ స్టేట్‌లో ప్రభావం ఉంటుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, ఇజ్రాయిల్ యుద్ధం సెన్సిటివ్ టాపిక్‌గా మారి రాష్ట్రంలో హారిస్ ప్రచారం చేస్తున్నారు. ఇరాన్ అణు, చమురు క్షేత్రాలపై దాడి చేయవద్దని జో బిడెన్, ఇజ్రాయిల్‌ని కోరారు. అయితే, నెతన్యాహూ మాత్రం ఇజ్రాయిల్ దాని జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందని చెప్పారు. మరికొందరు యూఎస్ నిపుణులు మాత్రం.. నెతన్యాహూ చర్యలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపవని భావిస్తున్నారు.