NTV Telugu Site icon

Hamas: హమాస్‌ను అంతం చేస్తా.. మాట మార్చుడు లేదు.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

Untitled 2

Untitled 2

Hamas-israel war: ఇజ్రాయిల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో.. ఖతార్, యుఎస్‌, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహించగా ఈ దేశాల నేతృత్వంలో కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. కాగా చేసుకున్న ఒప్పందం ప్రకారం దశల వారీగా హమాస్ తన ఆధీనంలో ఉన్న ఇజ్రాయిల్ బందీలను విడుదల చేసేందుకు అంగీకరించింది. అలానే ఇజ్రాయిల్ కూడా తన ఆధీనంలో ఉన్న హమాస్ బందీలను విడుదల చేసేందుకు అంగీకరించింది. కాగా నాలుగు రోజులు ఇరు దేశాలు కాల్పులను విరమిచుకునే విధంగా ఈ ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందం గడువు మరో రెండు రోజులకు పొడిగించబడింది. అయితే శుక్రవారం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజా ప్రకటన చేశారు.

Read also:Kakani Govardhan Reddy: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడుదాం ఆంధ్రా..

అంతర్జాతీయ మాధ్యమాల సమాచారం ప్రకారం.. హమాస్‌ను అంతమొందించాలని ఇజ్రాయెల్ ప్రమాణం చేసిందని.. కనుక ఎట్టి పరిస్థితి లోను దాడులను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వివరాలలోకి వెళ్తే.. శుక్రవారం జెరూసలెం లోని ప్రధానమంత్రి కార్యాలయంలో బ్లింకెన్‌తో బెంజమిన్ నెతన్యాహు సమావేశమయ్యారు. ఈ సమావేసంలో మాట్లాడిన నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హమాస్‌ను అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రమాణం చేసిందని.. అలానే నేనూ ప్రమాణం చేశానని తెలిపారు.. ఈ నేపథ్యంలో హమాస్ ను అంతం చేసి.. చేసిన ప్రమాణం నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.. మా సంకల్పాన్ని ఏది ఆపలేదని ఆయన స్పష్టం చేసినట్లు అంతర్జాతీయ మాధ్యమాల సమాచారం.