Israel-Hezbollah: ఇజ్రాయెల్- లెబనాల్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. తాజాగా, లెబనాన్‌లోని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 22 మంది మృతి చెందగా.. మరో 117 మంది తీవ్రంగా గాయపడ్డారు అని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా.. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యాలయంపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడినట్లు సమాచారం.
Read Also: Iron Wire in Biscuit: బిస్కెట్ లో ఇనుప తీగ.. పిల్లలు జాగ్రత్త అంటూ వీడియో షేర్ చేసిన ఓ తండ్రి..
అయితే, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యాలయంపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరపడాన్ని ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో తీవ్రంగా ఖండించారు. దీన్ని యుద్ధనేరంగా పరిగణిస్తామని చెప్పుకొచ్చారు. ఈ దాడులపై వాషింగ్టన్ సైతం రియాక్ట్ అయింది. హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసే సమయంలో యూఎన్ శాంతి పరిరక్షకుల భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఉండటం కష్టమని చెప్పుకొచ్చింది. ఇక, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో యూఎన్ పరిరక్షకులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని అమెరికా సూచించింది.