Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!

  • ఫ్లైదుబాయ్ ఘటనపై దర్యాప్తు
  • భారత కెప్టెన్ స్మిత్ మచార్‌పై ఒమన్ కో-పైలట్ దాడి
  • విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడని ఇజ్రాయెల్ ఆరోపణ
  • నిందితుడిని ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్
Flydubai (1)

Flydubai (1)

Flydubai Attack: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073ను కూల్చేందుకు కో-పైలట్ ప్రయత్నించడం సంచలనంగా మారింది. దాదాపుగా 180 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశాడు. దాడికి పాల్పడిన పైలట్‌ను ఒమన్ జాతీయుడిగా ఇజ్రాయిల్ చెబుతోంది. స్మిత్‌తో పాటు ప్రయాణికుల పోరాటంతో విమానం సురక్షితంగా సౌదీ అరేబియాలో ల్యాండైంది.

యూఏఈతో కలిసి ఫ్లైట్ ఘటనను ఇజ్రాయిల్ దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే, ఘటనకు పాల్పడిన కో-పైలట్‌ను ఇజ్రాయిల్ తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తుంది. కానీ ఇది సాధ్యమయ్యేలా కనిపించిడం లేదు. ప్రస్తుతం నిందితుడు సౌదీ అరేబియాలో ఉండటంతో సమస్య దౌత్యపరంగా చిక్కుల్ని ఎదుర్కొంటోంది. ఇజ్రాయిల్, సౌదీ అరేబియాతో దౌత్య సంబంధాలు లేవు. పైలట్ ఒమన్ జాతీయుడు. ఇజ్రాయిల్‌కు ఒమన్‌తో కూడా దౌత్య సంబంధాలు లేవు. ఇక యూఏఈతో దౌత్య సంబంధాలు ఉన్నప్పటికీ, రెండు దేశాల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం లేదు. దీంతో ఇజ్రాయిల్‌కు పైలట్‌ను అప్పగించడం దాదాపు అసాధ్యమే అని తెలుస్తోంది.

ప్రస్తుతం సౌదీ అరేబియా అతడిని ప్రాథమికంగా విచారిస్తోంది. దీని తర్వాత నిందితుడైన కోపైలట్‌ను యూఏఈకి అప్పగించే అవకాశం ఉంది. విమానం యూఏఈకి చెందింది కావడంతో, ఘటనకు సంబంధించిన దర్యాప్తులో యూఏఈ అధికారులు పాల్గొంటున్నారు. తదుపరి దశలో యూఏఈకి నిందితుడిని అప్పగిస్తారు. అయితే, ఇప్పుడు అతడిని ఇజ్రాయిల్‌కు అప్పగిస్తారా? లేదా? అనేది అస్పష్టంగా ఉంది.

మరోవైపు తమకు అప్పగించాలని ఇజ్రాయిల్ డిమాండ్ చేస్తోంది. ‘‘విమానాన్ని కూల్చి 180 మంది ఇజ్రాయిలీలనున చంపేందుకు యత్నించిన వ్యక్తిని ఇజ్రాయిల్‌కు అప్పగించి, ఇక్కడే అత్యంత కఠినమైన శిక్ష విధించాలి’’ అని ఇజ్రాయిల్ భద్రతా మంత్రి బెన్ గ్విర్ కోరారు. ఇందుకోసం న్యాయ మంత్రిత్వ శాఖ, సంబంధిత దౌత్య అధికారులను సంప్రదించి అందుబాటులో ఉన్న మార్గాలను వినియోగించాలని భద్రతా కేబినెట్‌లో కోరనున్నట్లు ఆయన తెలిపారు.