Site icon NTV Telugu

Israel: భారతీయులకు కలిసి వస్తున్న ఇజ్రాయిల్-గాజా యుద్ధం.. లక్ష మందికి పని..

Israel

Israel

Israel: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి 1400 మందిని దారుణంగా ఊచకోత కోశారు. మరో 200 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ సైన్యం భీకరంగా దాడులు చేస్తోంది. వైమానిక దాడులతో పాటు భూతల దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజాను పూర్తిగా దిగ్బంధించింది. మరోవైపు ఇజ్రాయిల్ లో ఉన్న పాలస్తీనియన్లను పంపించేంది.

Read Also: Uttar Pradesh: పెళ్లికి నిరాకరించిన వితంతువు.. నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భారతీయులకు కలిసి వస్తోంది. ముఖ్యంగా పాలస్తీనియన్లను పూర్తిగా ఇజ్రాయిల్ నుంచి పంపించేయడంతో కార్మికుల కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఏర్పడిన కార్మికులు, ఉద్యోగాలను భారతీయులతో భర్తీ చేయాలని ఇజ్రాయిల్ భావిస్తోంది. వాయిస్ ఆఫ్ అమెరికా నివేదిక ప్రకారం.. 90,000 మంది పాలస్తీనియన్ల స్థానంలో లక్ష మంది భారతీయ కార్మికునలు నియమించుకోవడానికి అనుమతించాలని పలు ఇజ్రాయిల్ నిర్మాణ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ విషయంలో తాము భారత్ తో చర్యలు జరుపుతున్నామని, తదుపరి ఆమోదం కోసం ఇజ్రాయిల్ అధికారుల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని ఇజ్రాయిల్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. దేశంలో పనిచేయడానికి, సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇండియా నుంచి 50,000 నుంచి లక్ష మంది కార్మికులు అవసరం అవుతారని అంచనా వేస్తున్నారు. పాలస్తీనా కార్మికులు వెళ్లడంతో ముఖ్యంగా నిర్మాణ రంగం తీవ్రంగా ప్రభావితమైంది.

ఇజ్రాయిల్-హమాస్ యుద్ధానికి నెల రోజులు పూర్తయ్యాయి. హమాస్‌‌ని పూర్తిగా నేలమట్టం చేసేదాకా తాము విశ్రమించబోమని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ అమెరికాతో పాటు ఏ దేశం చెప్పిన వినే పరిస్థితిలో లేదు. గాజా స్ట్రిప్, ముఖ్యంగా ఉత్తర గాజాలోని హమాస్ స్థావరాలను నెలమట్టం చేస్తోంది. ఇప్పటికే గాజాలో కీలకంగా ఉన్న హమాస్ ఉగ్రవాదుల్లో చాలా మందిని చంపేసింది. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 10 వేల మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు.

Exit mobile version