Israel Iran War: ఇజ్రాయిల్ ఏడో రోజు కూడా ఇరాన్‌పై భీకర దాడిని కొనసాగించింది. గురువారం రాత్రిపూట ఇరాన్ లోని అరక్ అణు రియాక్టర్‌ని లక్ష్యంగా చేసుకుని, నటాజ్ ప్రాంతంలోని అణ్వాయుధ కేంద్రంపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇరాన్ అణు కేంద్రాల్లో పాక్షికంగా నిర్మించిన ‘‘హెవీ వాటర్ రియాక్టర్’’ ఉంది. దీనిని మొదట అరక్ అని, ఇప్పుడు ఖోడాబ్ అని పిలుస్తున్నారు.
Israel Iran War: ఇరాన్ అత్యంత రహస్యమైన, సురక్షిత ‘‘నటాంజ్’’ అణు సముదాయంపై ఇజ్రాయిల్ ఖచ్చితమైన దాడిని నిర్వహించినట్లు తెలుస్తోంది. భూగర్భం లోతులో ఎంతో సురక్షితమైన ఈ స్థావరాన్ని ఇజ్రాయిల్ విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) మంగళవారం చెప్పింది. నటాంజ్ యూరేనియం ఎన్‌రిచ్‌మెంట్ ప్లాంట్ ఈ దాడిలో ధ్వంసమైనట్లు వెల్లడించింది.