NTV Telugu Site icon

Hamas-Israel: కాల్పుల విరమణ ఒప్పందంపై కొనసాగుతున్న ఉత్కంఠ! చివరి నిమిషంలో ఏం జరిగిందంటే..!

Hamasisrael

Hamasisrael

హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లుగా మూడు, నాలుగు రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఇరు దేశాల నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. స్పష్టమైన ప్రకటన రాక.. అంతా కన్‌ఫ్యూజ్ నడుస్తోంది. ఓ వైపు చర్చలు అంటూనే.. ఇంకోవైపు ఇజ్రాయెల్‌.. గాజాపై దూకుడుగా వెళ్తోంది. దీంతో చర్చలు కొలిక్కి రాలేనట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Bidar ATM Robbery: హైదరాబాద్‌లో బీదర్ దొంగలు.. పోలీసుల్ని చూసి కాల్పులు

బందీలు అప్పగించేందుకు హమాస్ రెడీగా లేనట్లుగా కనిపిస్తోంది. అది కూడా వంతుల వారీగా అప్పగిస్తామని చెబుతున్నట్లుగా సమాచారం. దీంతో చర్చలపై సందిగ్ధం నెలకొంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వంలోని కొందరు అంగీకరించనట్లుగా తెలుస్తోంది. ఇలా చర్చలపై తీవ్ర ఉత్కంఠ చోటుచేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇజ్రాయెల్ కేబినెట్ భేటీ కూడా జరగలేదు. ఒప్పందానికి అంగీకారం తెలిపేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయాలి. కానీ మంత్రివర్గ సమావేశం ఇప్పటి వరకు జరగలేదు. ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్‌ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. మరోవైపు హమాస్ పెడుతున్న కొర్రీలు కూడా ఇజ్రాయెల్‌కు అంగీకారంగా లేనట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Pattudala: అజిత్ ‘పట్టుదల’ ట్రైల‌ర్ అదిరింది.. చూశారా?

యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్‌-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చినట్లు మధ్యవర్తిత్వం వహిస్తున్న ప్రతినిధులు బుధవారం ప్రకటించారు. ఖతార్‌ ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించింది. తొలి ఫేజ్‌లో భాగంగా.. గాజాలో తాము బంధీలుగా ఉంచిన 33 మందిని హమాస్‌ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొదట ఇద్దరు అమెరికన్లను విడుదల చేస్తారు. దానికి ప్రతిగా జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా బంధీలను ఇజ్రాయెల్‌ విడుదల చేయాలి. ఈ చర్చలు జరుగుతుండగానే ఇజ్రాయెల్.. గాజాపై దాడి చేసింది. ఈ ఘటనలో పదుల కొద్దీ ప్రాణాలు పోయాయి. మరికొందరికి గాయాలైనట్లు ఒక ప్రకటనలో గాజా పేర్కొంది. దీంతో ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

అక్టోబరు 7, 2023న హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి ఇజ్రాయెల్‌ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా తీసుకెళ్లింది. హమాస్‌కు మద్దతుగా హిజ్బుల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్-ఇజ్రాయెల్‌ మధ్య పరస్పర క్షిపణి దాడులు కూడా జరిగాయి.

ఇది కూడా చదవండి: Bidar ATM Robbery: హైదరాబాద్‌లో బీదర్ దొంగలు.. పోలీసుల్ని చూసి కాల్పులు