టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్, తబితా సుకుమార్ దంపతుల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో పాటు గోపీ టాకీస్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, శేష సింధు రావులు నిర్మాతలుగా పద్మావతి మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరించారు. పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా తెరకెక్కిన ఈ సందేశాత్మక చిత్రంలో నటనకు గాను దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, దాదా సాహెబ్ ఫాల్కే, ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ తొలి సినిమా బాలనటిగా సుకృతి వేణి బండ్రెడ్డి అవార్డు అందుకుంది.
Aishwarya Rajesh: నలుగురు పిల్లల తల్లైనా ‘భాగ్యం’ బంగారమబ్బా!
ఇవే కాకుండా.. 11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా, న్యూఢిల్లి ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరి బెస్ట్ ఫిలింగా, ఉత్త ప్రాంతీయ చిత్రంగా అవార్డులు అందుకోగా, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ల్ తో పాటు 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ జ్యూరీ ఫిలింగా గాంధీ తాత చెట్టు అవార్డులు అందుకోవడం విశేషం. ఇక ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఈ సినిమా టీం రచ్చబండ అంటూ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సుకుమార్ భార్య తబిత మీడియాతో మాట్లాడుతూ తన కూతురు గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. ఈ సినిమా చేసినప్పుడు తన కూతురు వయసు 12 13 ఏళ్లు ఉంటుందని ఆ వయసులో ఉన్న పిల్లలు జుట్టు కత్తిరించుకోవాల్సి వస్తేనే మారాం చేస్తారని చెప్పుకొచ్చింది. తన కూతురు మాత్రం నటన మీద ఉన్న ఆసక్తి కారణంగా గుండు చేయించుకోవడానికి సిద్ధమైంది అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే సుకుమార్ స్టేజ్ మీదకు వెళ్లి ఆమెను ఓదార్చారు.