Israel-Hamas: ఇజ్రాయెల్ దూకుడు చర్య.. గాజాలో విద్యుత్ సరఫరా నిలిపివేత
- ఇజ్రాయెల్ దూకుడు చర్య
- గాజాలో విద్యుత్ సరఫరా నిలిపివేత
- నిలిచిన వాటర్ ఫ్లాంట్ ఉత్పత్తులు
- ఆకలితో పాటు నీళ్ల కొరతతో గాజా వాసుల ఇబ్బందులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజా-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరోసారి తీవ్రమవుతున్నాయి. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో సర్వనాశనం అయింది. ఇటీవల అంతర్జాతీయ మధ్యవర్తుల ద్వారా పరిస్థితులు సద్దుమణిగాయి. అంతా బాగున్నాయి అనుకుంటున్న సమయంలో మరోసారి పరిణామాలు తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Divya Bharathi : కన్యా రాశి కలువ..’ దివ్య భారతి’ వయ్యారాలు బరవా
Also Read
ఇటీవల హమాస్-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత ఒప్పందం ముగిసింది. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలు కొద్దిమంది మాత్రమే విడుదలయ్యారు. దీంతో తొలి విడత ఒప్పందాన్ని కొనసాగించాలని.. మొత్తం బందీలందరినీ విడుదల చేయాలని ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. అందుకు హమాస్ ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో గాజాకు వెళ్లే సాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంది. దీంతో నిత్యావసరాల ట్రక్కులన్నీ కూడా సరిహద్దుల్లోనే నిలిచిపోయాయి. దీంతో ఆహార సంక్షోభం ఏర్పడింది. తాజాగా ఇజ్రాయెల్ మరో చర్యకు దిగింది. ఇజ్రాయెల్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌ను నిలిపివేసింది. దీంతో గాజాలో అంధకారంతో పాటు.. నీటిని శుద్ధి చేసే ప్లాంట్లన్నీ నిలిచిపోయాయి. దీంతో ఆకలితో పాటు నీళ్ల కొరత కూడా ఏర్పడింది. పరిస్థితులు మరింత ధీన స్థితికి దిగజారిపోయాయి.
ఇది కూడా చదవండి: Group1 Results: గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త.. నేడు విడుదలకానున్న ఫలితాలు
అయితే ఈ చర్యను హమాస్ ఖండించింది. ఇజ్రాయెల్ బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపించింది. రెండో దశ ఒప్పందాన్ని చేసుకోవాలని హమాస్ తెలిపింది. ఇందుకోసం వెంటనే చర్చలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది. అయితే మొదటి దశ ఒప్పందాన్నే ఏప్రిల్ వరకు కొనసాగించాలంటూ ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. దీంతో ఇరువర్గాల చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది.
అక్టోబర్ 7, 2023న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి పగతో రగిలిపోయింది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. గాజాను ధ్వంసం చేసింది. వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా.. హమాస్‌కు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని.. లేదంటే నరకం చూస్తారని హమాస్‌ను తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాకుండా గాజాను ఖాళీ చేయాలని.. అభివవృద్ధి చేసి ఇస్తామని ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలను అరబ్ దేశాలు ఖండించాయి. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు కూడా ట్రంప్ ఇవే వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఒకేసారి బందీలు విడుదల కోసం హమాస్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడి పెంచుతోంది. దీనికి హమాస్, అంతర్జాతీయ మధ్యవర్తులు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: Abhinaya : పెళ్లిపీటలెక్కబోతున్న స్టార్ నటి
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!