Israel Strikes Iran: ఇరాన్ సైనిక లక్ష్యాలపై క్షిపణులతో ఇజ్రాయెల్ దాడి..
- ఇరాన్‌లో నిర్దిష్ట సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు..
- తమ దేశంపై ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారంగా ఈ క్షిపణి దాడులు..
- టెహ్రాన్.. కరాజ్ నగరాల సమీపంలో పేలుళ్లు జరిగినట్లు కథనాలు ప్రసారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Strikes Iran: ఇరాన్‌లో నిర్దిష్ట సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు స్టార్ట్ చేసింది. ఈరోజు (శనివారం) తెల్లవారు జాము నుంచి ఈ మేరకు దాడులు చేస్తోంది. ఇటీవల ఇరాన్ తమ దేశంపై దాడికి యత్నించిందని.. దానికి ప్రతీకారంగా ఈ దాడులు మొదలు పెట్టినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్ ప్రభుత్వం కొన్ని నెలల నుంచి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చేసిన దాడులకు ప్రతిస్పందనగా.. ప్రస్తుతం మా రక్షణ దళాలు ఆ దేశంలోని సైనిక లక్ష్యాలపై నిర్దిష్టమైన దాడులు నిర్వహిస్తున్నాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేసింది. ఇరాన్, దాని అనుకూల శక్తుల నుంచి ఎదురవుతున్న దాడులకు తిప్పి కొట్టే హక్కు, బాధ్యత తమకు ఉన్నాయని చెప్పుకొచ్చింది.
Read Also: Off The Record : ఆ BRS లీడర్స్ భయపడుతున్నారా.? వాళ్ళను వెంటాడుతున్న భయమేంటి.?
Also Read
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- PM Modi: ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
ఇక, ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్‌తో దాడికి పాల్పడిందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. తమ రక్షణ, ఇతర సామర్థ్యాలు సంపూర్ణంగా సమీకరించుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడి పరిధి తెలియరాలేదు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ చుట్టు పక్కల బలమైన పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఆ దేశ ప్రభుత్వ మీడియా కథనాలు ప్రసారం చేసింది. సమీపంలోని కరాజ్ నగరంలో కూడా పేలుళ్లు వినిపించాయని చెప్పుకొచ్చింది. కాగా అక్టోబరు 1వ తేదీన ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ 200లకు పైగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. వీటిలో దాదాపు అన్నింటిని ఇజ్రాయెల్ బలగాలు గగన తలంలోనే కూల్చివేసింది. ఆరు నెలల వ్యవధిలోనే ఇరాన్ చేసిన రెండవ ప్రత్యక్ష దాడిగా ఇజ్రాయెల్ పేర్కొనింది. అందుకే ప్రతీకార దాడి చేస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది.
In response to months of continuous attacks from the regime in Iran against the State of Israel—right now the Israel Defense Forces is conducting precise strikes on military targets in Iran.
The regime in Iran and its proxies in the region have been relentlessly attacking… pic.twitter.com/OcHUy7nQvN
— Israel Defense Forces (@IDF) October 25, 2024
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!