Israel-Iran War: ప్రయాణికులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్.. గగనతలాన్ని ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటన

  • విమాన ప్రయాణికులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్
  • నేటి రాత్రికి గగనతలం ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటన
  • ఇప్పటికే గల్ఫ్ దేశాల నుంచి బయల్దేరిన విమానాలు
Indiaisrael

Indiaisrael

విమాన ప్రయాణికులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్ చెప్పింది. గత 5 రోజులుగా ఇరాన్‌పై యుద్ధం కారణంగా పశ్చిమాసియా సహా గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో గగనతలం మూసేయడంతో విమాన ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. విమానాశ్రయాల్లో బందీ అయిపోయారు. డ్రోన్, క్షిపణి దాడులు కారణంగా ప్యాసింజర్స్ అల్లాడిపోయారు. ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో ఆయా దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు గల్ఫ్ దేశాలతో సంప్రదించడంతో గత రాత్రి నుంచి గగనతలాన్ని పరిమిత స్థాయిలో ఓపెన్ చేశాయి. దీంతో అనేక మంది ప్రయాణికులను స్వదేశాలకు తరలివస్తున్నారు. ఇప్పటికే గల్ఫ్ దేశాల నుంచి అనేక మంది తిరిగి భారతీయులతో పాటు అనేక దేశ ప్రజలు స్వదేశాలకు చేరుకుంటున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా గుడ్‌న్యూస్ చెప్పింది. నేటి రాత్రి నుంచి గగనతలాన్ని తెరవబోతున్నట్లుగా ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Trump: అదంతా అబద్దం.. అంతర్జాతీయ కథనాలపై ట్రంప్ క్లారిటీ

ఆయా దేశాలకు చెందిన విమానాలు బుధవారం-గురువారం మధ్య ప్రయాణాలు ప్రారంభించనున్నాయి. అలాగే ఇతర దేశాల్లో చిక్కుకున్న ఇజ్రాయెల్ ప్రయాణికులు కూడా స్వదేశానికి చేరుకోనున్నారు. ఇక గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయ పౌరులను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వదేశానికి తీసుకొస్తున్నారు. ఇప్పటికే అనేక మందిని స్వదేశానికి రప్పించారు. ఈ రాత్రి కూడా పలు విమానాల్లో భారతీయులు రానున్నారు.

ఇది కూడా చదవండి: Stock Market: స్టాక్ మార్కెట్‌లో కల్లోలం.. భారీ నష్టాల్లో సూచీలు