Islamabad blast: పాక్‌లో ఎమర్జెన్సీ.. ఇస్లామాబాద్‌ భారీ పేలుడు.. 70 మందికి పైగా మృతి..

  • ఇస్లామాబాద్‌లో భారీ ఆత్మాహుతి దాడి..
  • 15 మందికి పైగా మృతి, 80 మందికి గాయాలు..
  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
  • పాక్ రాజధానిలో ఎమర్జెన్సీ విధింపు..
Islamabad Blast

Islamabad Blast

Islamabad blast: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఒక ప్రార్థనా మందిరం లోపల జరిగిన ఆత్మాహుతి దాడిలో 24 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. 160 మందికి పైగా గాయపడ్డారు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. నగరంలోని షెహజాద్ టౌన్ ప్రాంతంలో ఉన్న తర్లై ఇమామ్‌బర్గా వద్ద ఈ పేలుడు సంభవించింది. శుక్రవారం మధ్యామ్నం షియా ప్రార్థనా మందిర ప్రధాన ద్వారా వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది.

Read Also: Toxic Telugu Rights: దిల్ రాజు చేతికి ‘టాక్సిక్’.. తెలుగు రైట్స్‌తో యశ్ సృష్టించిన సెన్సేషన్ ఇదే!

భారీ దాడిలో ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. బాంబర్ ను ముందుగా ద్వారాల వద్దే సెక్యూరిటీ అధికారులు నిలిపేశారు. మెయిన్ ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడని చెప్పారు. ఒక వేళ ప్రధాన ప్రార్థనా స్థలంలో పేలుడు జరిగితే భారీ సంఖ్యలో భక్తులు మరణించేవారని చెబుతున్నారు.

భక్తులు బయటకు వస్తున్న మసయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రతతో ప్రార్థనా మందిరం ప్రవేశ ద్వారం పూర్తిగా ధ్వంసమవ్వగా, చుట్టు పక్కల భవనాల కిటికీలు పగిలిపోయాయి. రోడ్డలపై శిథిలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడిన వారిని పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , పాలిక్లినిక్ ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లో ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇది. గతేడాది నవంబర్ 11,2025లో జిల్లా కోర్టు సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగి 12 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు.