Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్న ఒక కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ కోస్ట్ గార్డ్ దళాలు దాడికి దిగాయి. ఈ నౌకలో 12 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు కేంద్ర ఓడరేవుల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఏప్రిల్ 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే.. టోగో (Togo) దేశ జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సిరాన్’ (MT Siron) అనే కెమికల్ ట్యాంకర్ ఒమన్‌లోని షినాస్ పోర్ట్ పరిమితికి సమీపంలో ఇతర నౌకలతో కలిసి వెళ్తోంది. ఆ సమయంలో ఇరాన్ కోస్ట్ గార్డ్ ఒక్కసారిగా హెచ్చరిక కాల్పులు జరిపింది. ఈ దాడిలో నౌకలోని భారతీయ సిబ్బంది ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
భారత ప్రభుత్వం స్పందన..
ఈ ఘటనపై కేంద్ర ఓడరేవుల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మన్దీప్ సింగ్ రంధవా సోమవారం విలేకరులతో మాట్లాడారు. “ఏప్రిల్ 25న ఎంటీ సిరాన్ నౌకపై దాడి జరిగింది. ఈ నౌకలో భారతీయ సిబ్బంది ఉన్నట్లు సమాచారం అందింది. ప్రస్తుతం సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని” ఆయన తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), భారత రాయబార కార్యాలయాలు, ఇతర ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సముద్ర ప్రయాణాల్లో భారతీయ నావికుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రంధవా స్పష్టం చేశారు. నిజానికి ఇరాన్ దళాలు భారతీయ నౌకలపై ఇలా దాడులు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ రెండు భారతీయ నౌకలపై దాడులు చేశాయి. వీఎల్సీసీ సన్మార్ హెరాల్డ్, జగ్ అర్నవ్ నౌకలు ‘హార్ముజ్ జలసంధి’ దాటుతున్న సమయంలో ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ వరుస ఘటనలపై భారత ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఒమన్ తీరంలో జరిగిన తాజా ఘటనతో పశ్చిమాసియా సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Also Read
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
- Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
తాజావార్తలు
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!