US-Iran War: ‘ట్రంప్‌ను చంపేస్తాం’.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- టెహ్రాన్‌లో ట్రంప్‌ను శవపేటికలో చూపిస్తూ భారీ బిల్బోర్డ్ ఏర్పాటు.
- "We Will Kill Trump" అంటూ ఇంగ్లీష్, పర్షియన్లో బెదిరింపు సందేశం.
- ఖమేనీకి నివాళిగా, అమెరికా-ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా భారీ వైమానిక దాడులకు పాల్పడుతోంది. దీనికి ప్రతిగా ఇరాన్ మిడిల్ ఈస్ట్‌లోని యూఎస్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఒక బిల్ బోర్డుపై ప్రకటన ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇందులో ట్రంప్‌ను చంపేస్తామని చెబుతూ, ఆయన ఒక శవపేటికలో ఉన్నట్లు ఫోటోను ప్రదర్శించారు. ఇంగ్లీష్, పర్షియన్ భాషల్లో ‘‘ట్రంప్‌ను చంపేస్తాం’’ అని దానిపై రాశారు.
ట్రంప్ జుట్టు చిందరవందగా ఉండగా, కళ్లు, నోరు మూసుకుని శవపేటికలో పడి ఉన్నట్లుగా ఇరాన్ చూపించింది. ఈ బిల్బోర్డుకు సమీపొంలో ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి సంబంధించిన బొమ్మను ఏర్పాటు చేశారు. సాధారణంగా ఇరాన్లో ఇలా రాజకీయ సందేశాలు ప్రజలకు చేరవేసేందుకు బిల్‌బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఆ దేశ రాజధాని టెహ్రాన్‌తో పాటు ప్రతీ నగరంలో అమెరికా, ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా నినాదాలు, ఫోటోలను ప్రదర్శిస్తున్నారు.
Also Read
- US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
- Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్‌పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
- Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
- Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్‌కు అమెరికా బ్రేక్!
ఇలాంటి ప్రచార బోర్డులు ఇదే తొలిసారి కాదు. ఇటీవల ట్రంప్ లక్ష్యంగా ఇరాన్ వ్యాప్తంగా పలు పోస్టర్లు వెలిశాయి. మే నెలలో ఏర్పాటు చేసిన ఒక పోస్టర్లో ఆయన నోటికి కుట్లు వేసినట్లు చూపించారు. మరో హోర్డింగ్‌లో పర్షియన్ గల్ఫ్‌లో భారీ వలలో అమెరికా యుద్ధ విమానాలు, డ్రోన్లు, నౌకలు చిక్కుకున్నట్లుగా చూపించే పోస్టర్ ప్రదర్శించారు. ఇటీవల ఖమేనీ అంత్యక్రియల వేళ, ట్రంప్, నెతన్యాహూలను చంపేస్తామంటూ నినాదాలు చేస్తూ పోస్టర్లు ప్రదర్శించారు. ఇదే కాకుండా ఇటీవల ఇరాన్ హిట్ లిస్ట్‌లో ట్రంప్, నెతన్యాహూ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో సహా 12 మంది విదేశీ నేతల ఉన్నట్లుగా కన్జర్వేటివ్ పత్రిక నివేదించింది.
తాజావార్తలు
-
White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
-
Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్‌కు కాదు, రేవంత్‌కే నా సపోర్ట్
-
Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
-
Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్‌పై మీ విమర్శలు ఎందుకు..’?
-
Chinna Reddy : పదవి పోయినా గౌరవం ఉంది.. చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!