Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
- అమెరికాకు ఇరాన్ మరోసారి హెచ్చరిక
- చిన్న తప్పు చేసినా దాడులుంటాయని వార్నింగ్
- న్యూయార్క్‌లో పరోక్ష చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాకు ఇరాన్ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. ఈసారి అమెరికా చిన్న తప్పు చేసినా.. మధ్యప్రాచ్యంలోని యూఎస్ స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ హెచ్చరిక వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ అత్యున్నత ఆపరేషనల్ మిలిటరీ కమాండ్ అయిన ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ ఈ హెచ్చరిక చేసింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ద్వారా విడుదలైన ప్రకటనను సెమీ-అధికారిక మెహర్ న్యూస్ ఏజెన్సీ ప్రచురించింది.
వాషింగ్టన్ తమపై “తప్పు” చేస్తే.. ఈ ప్రాంతంలోని అన్ని అమెరికా సైనిక మోహరింపు కేంద్రాలు, అమెరికా ప్రయోజనాలు లక్ష్యంగా మారుతాయని ఖతమ్ అల్-అన్బియా కమాండ్ హెచ్చరించింది. “ప్రస్తుతం ఈ ప్రాంతం అత్యంత సున్నితమైన భద్రతా పరిస్థితుల్లో ఒకదశలో ఉంది” అని ప్రకటనలో పేర్కొన్నట్లు మెహర్ తెలిపింది. తాము యుద్ధాన్ని ప్రారంభించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే తమపై దాడి జరిగితే అందుకు ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. అదే సమయంలో అమెరికా సైనిక చర్యలకు సహకరించే దేశాలను కూడా ఘర్షణలో భాగస్వాములుగా పరిగణించే అవకాశం ఉందని ఇరాన్ సైనిక కమాండ్ హెచ్చరించింది.
Also Read
- Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
- Putin: ఐరోపాతో ఘర్షణ కోరడం లేదు.. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనన్న పుతిన్
- Thailand Floods: థాయ్‌లాండ్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన వందలాది కార్లు.. ఎమర్జెన్సీ ప్రకటన
- Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
ఇదిలా ఉండగా హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, అణు చర్చలను పునఃప్రారంభించేందుకు ఇరాన్ చేసిన ఏడు రోజుల ప్రతిపాదనపై అమెరికా స్పందన కోసం టెహ్రాన్ ఎదురుచూస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా కొన్ని షరతులను అంగీకరిస్తే ఏడు రోజుల్లో వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచి, అణు చర్చలను పునఃప్రారంభించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉంది. అమెరికా ఇరాన్ నౌకాశ్రయాలపై విధించిన నావికా దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఇరాన్ చమురుపై ఆంక్షలను సడలించడం, కాల్పుల విరమణను పాటించడం వంటి డిమాండ్లు ఈ ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం. ఈ చర్యలు అమలైతే హార్ముజ్ జలసంధి ద్వారా సాధారణ నౌకాయానం తిరిగి ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని ఇరాన్ చెబుతోంది.
న్యూయార్క్‌లో పరోక్ష చర్చలు
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ వారం న్యూయార్క్‌లో అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తుల ద్వారా పరోక్ష చర్చలు జరిగాయి. ఖతార్‌తో పాటు మరికొన్ని దేశాలు కూడా వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య దౌత్యపరమైన ప్రయత్నాల్లో భాగస్వామ్యమవుతున్నాయి. హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం, ఇరాన్ అణు కార్యక్రమం వంటి అంశాలు ఈ చర్చల్లో కీలకంగా మారాయి.
అయితే దౌత్యపరమైన ప్రయత్నాలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఆ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. ఇరాన్ తన అణు కార్యక్రమానికి సంబంధించి అమెరికా డిమాండ్లను అంగీకరిస్తుందా అనే విషయంలో ట్రంప్ అనుమానంతో ఉన్నారని ఆ కథనం పేర్కొంది. నవంబర్ మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై అమెరికా బాంబు దాడులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా అమెరికా అధికారులు పేర్కొన్నట్లు జర్నల్ తెలిపింది. అయితే ఈ నివేదికలోని అంశాలను అమెరికా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు.
హార్ముజ్‌పైనే ఉత్కంఠ
ప్రస్తుతం ఇరాన్ నుంచి వచ్చిన సైనిక హెచ్చరిక, హార్ముజ్ జలసంధిని తెరవాలన్న ప్రతిపాదన, అమెరికా స్పందనపై నెలకొన్న అనిశ్చితి మధ్యప్రాచ్య పరిణామాలను మరింత సున్నితంగా మార్చాయి. ఇరాన్ తనపై దాడి జరిగితే ప్రతిస్పందిస్తామని చెబుతుండగా.. హార్ముజ్ జలసంధి, కాల్పుల విరమణ షరతులపై ఇరుదేశాల మధ్య దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
-
Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
-
Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
-
Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
-
Nani: “శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా”: నాని
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?