Iran-US War: ఏ పాపం చేసిందని అధికారి భార్యను చంపేశారు.. ప్రపంచానికి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ సూటి ప్రశ్న
- ఏ పాపం చేసిందని అధికారి భార్యను చంపేశారు
- ప్రపంచానికి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ సూటి ప్రశ్న
- ఎక్స్‌లో నిలదీసిన ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ పలు ప్రశ్నలు సంధించారు. ఒక అమాయక ఇరాన్ అధికారి భార్యను చంపడం ఎంత వరకు కరెక్ట్ అని సోషల్ మీడియా వేదికగా పెజెష్కియన్ నిలదీశారు. ఈ ఘటనపై ప్రపంచమే తీర్పు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా తీరుపై తీవ్ర ప్రశ్నలు సంధించారు. ఇలా చేస్తే దౌత్యం ఎలా జరుగుతుంది? అని అనుమానం వ్యక్తం చేశారు.
‘‘నేను అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే మా వ్యూహాత్మక విదేశీ విధాన మండలి ప్రధానుడి కుటుంబం హత్యాయత్నానికి గురైంది. ఈ దాడిలో ఆయన అమాయక భార్య మృతిచెందింది. దీనిపై ప్రపంచమే తీర్పు చేయాలి. సంభాషణ, చర్చలకు పాల్పడేది ఏ వైపు.. ఉగ్రవాదానికి దిగేది ఏ వైపు?.’’ ప్రపంచమే గమనించాలని పెజెష్కియన్ కోరారు.
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
ఈ ఘటనను అంతర్జాతీయ సంబంధాలతో పెజెష్కియన్ ముడి పెట్టారు. ఎవరు శాంతిపరులో.. ఎవరు వైరుద్యాన్ని సృష్టిస్తున్నారో గమనించాలని కోరారు. అమెరికా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తుండగా ఈ దాడి జరగడం ఏ మాత్రం భావ్యం అని అడిగారు. ఇది నిర్మాణాత్మక సంప్రదింపులకు సాధ్యమవుతుందా? అని వ్యాఖ్యానించారు. కాబట్టి రెండు దేశాల వైఖరిని ప్రపంచ దేశాలు అంచనా వేయాలని కోరారు. ఈ ఘటనపై మాత్రం ప్రపంచ దేశాలే తీర్పు చెప్పాలని డిమాండ్ చేశారు.
గత నెల 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. దీంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్‌లోని కీలక ప్రాంతాలను అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేశాయి. ఇక ఇరాన్ కూడా ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేశాయి. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేశాయి. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.
ఇదిలా ఉంటే ఇటీవల అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ కీలక ప్రసంగం చేశారు. 2, 3 వారాల్లో ఇరాన్ అంతు చూస్తామని.. ఇదంతా అమెరికా భవిష్యత్ కోసమే చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
Just as I was addressing the American people, the head of our Strategic Council on Foreign Policy was targeted in an assassination attempt, leading to the martyrdom of his innocent wife. Let the world judge; which side engages in dialogue and negotiation, and which in terrorism?
— Masoud Pezeshkian (@drpezeshkian) April 3, 2026
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!