US-Iran peace deal: మేము అణు బాంబు తయారు చేయం.. ఇరాన్ సంచలన ప్రకటన..

  • మేము అణు బాంబు తయారు చేయం..
  • సంచలన ప్రకటన చేసిన ఇరాన్ అధ్యక్షుడు..
  • స్విట్జర్లాండ్‌లో యూఎస్-ఇరాన్ శాంతి ఒప్పందం..
Us Iran Peace Deal

Us Iran Peace Deal

US-Iran peace deal:  స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆయన బృందం, ఇరాన్ తరుఫున స్పీకర్ మొహ్మమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అఘర్చీ ఆ దేశానికి చేరారు. మధ్యవర్తులుగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఖతార్ ప్రతినిధులు స్విట్జర్లాండ్ వెళ్లారు. తాజాగా ఒప్పందానికి సంబంధించిన కీలక విషయాలను ఇరాన్ అద్యక్షుడు మహ్మద్ పెజెష్కియాన్ వివరించారు.

పెజెష్కియాన్ మాట్లాడుతూ.. అవగాహన ఒప్పందం(ఎంఓయూ)లోని అన్ని నిబంధనలు మాకు అనుకూలంగా ఉన్నాయని, ఈ ఒప్పందం ప్రకారం ఖతార్‌లో ఫ్రీజ్ చేసిన 6 బిలియన్ డాలర్ల ఇరాన్ డబ్బును తిరిగి ఇస్తామని అమెరికా హామీ ఇచ్చినట్లు చెప్పారు. అమెరికా మా వద్ద అణు బాంబు ఉండకూడదని చెప్పిందని, మాకు అణు బాంబు వద్దు అని పెజెష్కియాన్ అన్నారు. ఈ చర్చల పట్ల ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తీవ్ర అసంతృప్తిలో ఉంటారని ఆయన ఎగతాళి చేశారు.

×
×
Ad

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆదివారం ఉదయం జ్యూరిచ్‌కు చేరుకోగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, సలహాదారు జారెడ్ కుష్నర్ అప్పటికే అక్కడ ఉన్నారు. జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడుతూ.. చర్చలు మంచి దిశలో సాగుతున్నాయని చెప్పారు. ఇరాన్ చర్చల బృందానికి స్పీకర్ ఘాలిబాఫ్ నాయకత్వం వహిస్తుండగా, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ సెక్రటరీ అలీ బఘేరీ కనీ, ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్నాసర్ హెమ్మతి వెంట వెళ్లారు.