Iran: అలీ లారిజానీ హతం తర్వాత ఇరాన్ వ్యూహం మారిందా? గల్ఫ్ ఇంధన క్షేత్రాలే టార్గెటా?
- మరింత తీవ్రంగా మారిన మధ్యప్రాచ్యం యుద్ధం
- అలీ లారిజానీ హతం తర్వాత మారిన ఇరాన్ వ్యూహం
- గల్ఫ్ ఇంధన క్షేత్రాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు
- తాజాగా ఖతార్ ఎల్‌ఎన్‌జీని ధ్వంసం చేసిన ఇరాన్
- అమాయక దేశంపై దాడి చేయొద్దని ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో యుద్ధం నిన్నటిదాకా ఒకెత్తు అయితే.. ఇప్పుడు మరో ఎత్తుగా మారిపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమాయ్యాక ఇరాన్ ప్రతీకార దాడులు స్వల్ప రేంజ్‌లోనే జరిగాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ అంతంత మాత్రంగానే దాడులు చేసింది. కానీ గత రెండు, మూడ్రోజులుగా సీన్ మారిపోయింది. ఇరాన్‌లోని అత్యున్నత నాయకులే లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ అంతమొందిస్తోంది.
రెండు రోజుల్లో ఖమేనీ కుడిభుజం అయిన ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారి అలీ లారిజానీ, ఇరాన్ ఆర్మీ చీఫ్ సోలేమానీ, అనంతరం ఇరాన్ నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ ను చంపిన తర్వాత ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది. దీంతో తాజాగా ఇరాన్ తన వ్యూహాన్ని మార్చుకుంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇంధన క్షేత్రాలే లక్ష్యంగా క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన క్షేత్రమైన ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ గ్యాస్ క్షేత్రంపై దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచం అల్లకల్లోలంగా మారిపోయింది.
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్‌పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్‌నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే గల్ఫ్ దేశాల్లో ఉన్న గ్యాస్, చమురు క్షేత్రాలపై ఇరాన్ భీకర దాడులు చేయొచ్చని సంకేతాలు వినిపిస్తున్నాయి. అదే గనుక జరిగితే ప్రపంచ పరిస్థితులు తల్లకిందులయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంతో అల్లాడిపోతున్నాయి. ఇరాన్ మరిన్ని దాడులు చేస్తే మాత్రం గ్యాస్, చమురు కోసం ప్రపంచ దేశాలు అల్లాడిపోవాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగారు. ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ తమకు తెలియకుండా దాడి చేసిందని.. దానికి ప్రతీకారంగా ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడి చేయడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. ఒక అమాయక దేశంపై దాడి చేయడం ఏ మాత్రం భావ్యం కాదని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో వాపోయారు.
ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ మాత్రమే దాడి చేసింది గానీ.. అందులో అమెరికాకు గానీ.. ఖతార్‌కు గానీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో చోటుచేసుకున్న పరిణామాలపై కోపంతో ఉన్న ఇజ్రాయెల్.. ఇరాన్‌లోని ప్రధాన గ్యాస్ కేంద్రంలోని ఒక భాగాన్ని లక్ష్యంగా చేసుకుందని.. అయినా ఈ దాడి గురించి వాషింగ్టన్‌కు ముందుగా ఎటువంటి సమాచారం లేదన్నారు. కానీ పూర్తి సమాచారం తెలియకుండా ఇరాన్ స్పందించిందని.. ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ మౌలిక సదుపాయాల్లోని ఒక భాగంపై అన్యాయంగా దాడి చేసిందని ఆరోపించారు. ఇరాన్ మరొకసారి ఖతార్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఇరాన్ సౌత్ పార్స్ మైదానంపై ఇజ్రాయెల్ కూడా దాడులకు పాల్పడదని హామీ ఇచ్చారు. అయినా కూడా ఇరాన్ హద్దులు మీరి ప్రవర్తిస్తే మాత్రం ఇజ్రాయెల్ ప్రమేయం లేకుండానే సౌత్ పార్స్ మైదానంపై అమెరికా అత్యంత శక్తివంతమైన బలప్రయోగం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
CM Vijay Removes White Towel: బ్రిటిష్ విఐపి సంస్కృతికి చెక్ పెట్టిన సీఎం విజయ్.. కుర్చీ నుంచి వైట్ టవల్ తొలగింపు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్‌తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..