Iran Supreme Leader: యహ్యా సిన్వార్ లేకపోయినా హమాస్ ఉనికికి ఢోకా లేదు..
- సిన్వార్‌ను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చడంపై స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్..
- యహ్యా సిన్వార్ అమరుడు కావడంతో అంతా అయిపోయినట్లు కాదు..
- ఇజ్రాయెల్ దాడిలో సిన్వార్ చనిపోయినా హమాస్ ఇంకా ఉనికిలోనే ఉంది: అయతుల్లా అలీ ఖమేనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Supreme Leader: హమాస్ మిలిటెంట్ సంస్థ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చడంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు.. అందులో సిన్వార్ మృతి బాధ కలిగిస్తోంది.. అయినప్పటికీ అతడు అమరుడు కావడంతో అంతా అయిపోయినట్లు కాదన్నారు. ఇజ్రాయెల్ దాడిలో అతడు చనిపోయినా హమాస్ ఇంకా ఉనికిలోనే ఉంది.. ఎప్పటికీ ఉంటుందని వెల్లడించారు. శత్రువులు తమపై విపరీత దాడులకు పాల్పడుతున్నప్పటికి.. సిన్వార్ వారికి ఎదురు నిలబడ్డారని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ వ్యూహాలకు దీటుగా ఆయన సమాధానం ఇచ్చారని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వెల్లడించారు.
Read Also: PCOS: స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసే ఈ వ్యాధితో డేంజరే
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- India-Nepal Border Dispute: భారత్‌తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
- Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
- Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
ఇక, 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై జరిపిన దాడులకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించి సిన్వార్ దెబ్బ కొట్టిన తీరును ప్రపంచం ఎప్పటికీ మరిచిపోదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తెలిపారు. ఇజ్రాయెల్- హెజ్బొల్లాల మధ్య జరుగుతున్న యుద్ధంలో హమాస్ చీఫ్ హసన్ నస్రల్లా చనిపోయిన తర్వాత లెబనాన్‌లోకి తన బలగాలను పంపేందుకు ఇరాన్ రెడీగా ఉందని ఆ దేశ ఉన్నతస్థాయి అధికారులు తెలిపారు.
Read Also: Bandi Sanjay: రేవంత్ తో మాకు దోస్తీ అవసరమేంది..? కేటీఆర్ ట్వీట్ పై బండి సంజయ్ ఆగ్రహం..
అయితే, ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్ష దాడి చేసింది. దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులతో ప్రయోగించగా.. ఆ తర్వాత దీనిపై అయతుల్లా అలీ ఖమేనీ స్పందిస్తూ హమాస్ అప్పటి అధినేత ఇస్మాయెల్ హనియా, హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా, నిల్పోరూషన్ చావులకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు వెల్లడించారు. అయితే, ఇరాన్ తమపై చేసిన క్షిపణుల దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఇజ్రాయెల్ తెలిపింది. అదే జరిగితే తమ స్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఖమేనీ హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతల మధ్య ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.
I congratulate the family of Yahya #alSinwar, his comrades, and all those devoted to jihad on the path of God on the martyrdom of our brother, Yahya al-Sinwar, and I offer my condolences for this loss.
— Khamenei.ir (@khamenei_ir) October 19, 2024
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!