NTV Telugu Site icon

Iran Supreme Leader: యహ్యా సిన్వార్‌ లేకపోయినా హమాస్‌ ఉనికికి ఢోకా లేదు..

Iran

Iran

Iran Supreme Leader: హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చడంపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు.. అందులో సిన్వార్ మృతి బాధ కలిగిస్తోంది.. అయినప్పటికీ అతడు అమరుడు కావడంతో అంతా అయిపోయినట్లు కాదన్నారు. ఇజ్రాయెల్ దాడిలో అతడు చనిపోయినా హమాస్‌ ఇంకా ఉనికిలోనే ఉంది.. ఎప్పటికీ ఉంటుందని వెల్లడించారు. శత్రువులు తమపై విపరీత దాడులకు పాల్పడుతున్నప్పటికి.. సిన్వార్‌ వారికి ఎదురు నిలబడ్డారని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ వ్యూహాలకు దీటుగా ఆయన సమాధానం ఇచ్చారని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వెల్లడించారు.

Read Also: PCOS: స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసే ఈ వ్యాధితో డేంజరే

ఇక, 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై జరిపిన దాడులకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించి సిన్వార్ దెబ్బ కొట్టిన తీరును ప్రపంచం ఎప్పటికీ మరిచిపోదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తెలిపారు. ఇజ్రాయెల్‌- హెజ్‌బొల్లాల మధ్య జరుగుతున్న యుద్ధంలో హమాస్‌ చీఫ్‌ హసన్ నస్రల్లా చనిపోయిన తర్వాత లెబనాన్‌లోకి తన బలగాలను పంపేందుకు ఇరాన్ రెడీగా ఉందని ఆ దేశ ఉన్నతస్థాయి అధికారులు తెలిపారు.

Read Also: Bandi Sanjay: రేవంత్ తో మాకు దోస్తీ అవసరమేంది..? కేటీఆర్ ట్వీట్ పై బండి సంజయ్ ఆగ్రహం..

అయితే, ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రత్యక్ష దాడి చేసింది. దాదాపు 200 బాలిస్టిక్‌ క్షిపణులతో ప్రయోగించగా.. ఆ తర్వాత దీనిపై అయతుల్లా అలీ ఖమేనీ స్పందిస్తూ హమాస్‌ అప్పటి అధినేత ఇస్మాయెల్‌ హనియా, హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా, నిల్పోరూషన్‌ చావులకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు వెల్లడించారు. అయితే, ఇరాన్‌ తమపై చేసిన క్షిపణుల దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఇజ్రాయెల్‌ తెలిపింది. అదే జరిగితే తమ స్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఖమేనీ హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతల మధ్య ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.