Hezbollah: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయిల్ వైమానిక దాడిలో చనిపోయాడు. శుక్రవారం లెబనాన్ రాజధాని బీరూట్‌పై భీకరదాడులు జరిపింది. ఈ దాడుల్లో నస్రల్లాతో పాటు హిజ్బుల్లా సదరన్ కమాండర్ అలీ కర్కీ కూడా మరణించాడు. వీరితో నస్రల్లా కుమార్తె జైనాబ్ కూడా మృతి చెందింది. అయితే, గత 30 ఏళ్లుగా ఇజ్రాయిల్‌కి చిక్కకుండా ఉన్న నస్రల్లా అచూకీ ఎలా లభించిందనే అనుమానం అందరిలో కలుగుతోంది.
నివేదికల ప్రకారం.. ఇరాన్‌కి చెందిన ఓ గూఢచారి ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇజ్రాయిల్ దాడులు చేసిందని తెలుస్తోంది. నస్రల్లాపై దాడి జరగడానికి కొన్ని గంటల ముందే ఇరాన్ వ్యక్తి ఇజ్రాయిల్‌కి సమాచారం ఇచ్చాడు. హిజ్బుల్లాకు చెందిన అనేక మంది ఉన్నత సభ్యులతో సమావేశం జరుగుతోందని, దీనికి నస్రల్లా కూడా వస్తున్నాడని,బీరూట్ దక్షిణ శివారులోని హిజ్బుల్లా భూగర్భ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతున్నట్లు అతను ఇజ్రాయిల్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడుని ఓ నివేదిక పేర్కొంది. ఆ తర్వాతే ఇజ్రాయిల్ బీరూట్‌పై విరుచుకుపడింది. భూగర్భంలోకి వెళ్లే బాంబుల్ని ఉపయోగించింది. ఏకంగా 80 వరకు బాంబులు కురిపించింది. ఈ దాడుల్లో బీరూట్ దద్దరిల్లిపోయింది. శనివారం నస్రల్లా మరణించాడని ఇజ్రాయిల్ ఆర్మీ ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత కొన్ని గంటలకు హిజ్బుల్లా తమ నాయకుడు మరణించినట్లు అధికార ప్రకటన వెల్లడించింది.
2006లో హిజ్బుల్లా- ఇజ్రాయిల్ యుద్ధం తర్వాత హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇంటెలిజెన్స్, గూఢచార వ్యవస్థను మెరుగుపరచాలని భావించింది.34 రోజులు ఈ పోరాటంలో ఇజ్రాయిల్‌ని హిజ్బుల్లా నిలువరించింది. ఇజ్రాయిల్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ పోరాటంలో నిర్ణయాత్మక విజయం సాధించడంలో విఫలమైందని ది న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది.
ఆ తర్వాతి సంవత్సరాల్లో ఇజ్రాయిల్ హిజ్బుల్లా నాయకత్వం, వ్యూహాలు, కమ్యూనికేషన్ వంటి వ్యవస్థల గురించి పూర్తి అవగాహాన ఏర్పరుచుకుంది. యూనిట్ 8000, ఇజ్రాయెల్ యొక్క సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, హిజ్బుల్లా సెల్‌ఫోన్లు, ఇతర కమ్యూనికేషన్‌లను మెరుగ్గా అడ్డగించేలా అత్యాధునిక సైబర్ సాధనాలను నిర్మించింది.
Read Also: Tirumala Laddu: టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ
పేజర్ దాడులతో మొదలు:
ఇటీవల లెబనాన్ వ్యాప్తంగా ఒక్కసారిగా పేజర్లు పేలాయి. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఈ ఘటనలో 37 మంది చనిపోగా, 3000 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ పేజర్లను ఉపయోగించే వారంతా హిజ్బుల్లా కార్యకర్తలు, ఆ సంస్థతో సంబంధాలు ఉన్నవారే. ఈ దాడి తమకు అపూర్వమైన దెబ్బగా నస్రల్లా చెప్పాడు. ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించాడు.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఇంటెలిజెన్స్ సేకరణలో ఇజ్రాయిల్ మొదటగా 2008లో సిరియా అగ్రశ్రేణి హిజ్బుల్లా నేత ఇమాద్ ముగ్నియాను చంపడానికి సీఐఏతో కలిసి పనిచేసింది. 2020లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఖాసిమ్ సులేమానీ సిరియాలోని డమాస్కస్‌లో నస్రల్లానున కలవడానికి బీరూట్‌కి కాన్వాయ్‌లో వెళ్లాడు. అయితే, యుద్ధం మొదలవుతుందనే భయంతో అప్పుడు నస్రల్లాని చంపడానికి ఇజ్రాయిల్ భయపడింది. ఈ సమాచారాన్ని అమెరికాకు అందించింది. ఆ తర్వాత బాగ్దాద్ విమానాశ్రయంలో డ్రోన్ దాడిలో సులేమాని మరణించాడు.
అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి తర్వాత నుంచి ఇజ్రాయిల్ ఇటు హమాస్, అటు హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది. వరసగా హిజ్బుల్లా కమాండర్లను హతం చేస్తోంది. హిజ్బుల్లాలో మిలిటర్ కమాండర్లలో ఒకరైన ఫువాద్ షుక్ర్‌ని బీరూట్‌లో ఎయిర్ స్ట్రైక్ చేసి హతమార్చింది. దాదాపు మూడు వారాల తర్వాత, ఒక దాడిలో హిజ్బుల్లా యొక్క ఎలైట్ రద్వాన్ ఫోర్స్ అధిపతి ఇబ్రహీం అకిల్ మరియు 15 మంది ఇతర కమాండర్లు మరణించారు. కొన్ని రోజుల తరువాత, మరొక దాడి ఇబ్రహీం మొహమ్మద్ కోబీస్సీని చంపింది, అతను గైడెడ్ మిస్సైల్స్ యూనిట్‌తో సహా అనేక హిజ్బుల్లా యూనిట్‌లకు నాయకత్వం వహించాడు. మరుసటి రోజు, హిజ్బుల్లా యొక్క డ్రోన్ యూనిట్ అధిపతి మహమ్మద్ స్రూర్ ఒక దాడిలో మరణించాడు.