Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Iran Seizes Pakistan Ship Strait Of Hormuz Us Iran War Update

Iran War: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన ఇరాన్..

Published Date :March 25, 2026 , 3:57 pm
By BV Reddy
  • పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన ఇరాన్..
  • హార్ముజ్‌లో పాక్ నౌకను సీజ్ చేసిన ఇరాన్..
Iran War: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన ఇరాన్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Iran War: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్ తహతహలాడుతోంది. రెండు దేశాల మధ్య యుద్ధం ఆగేందుకు ఇస్లామాబాద్‌లో చర్చలు జరుగుతాయనే నివేదికలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే, ఇరాన్ చేతిలో పాకిస్తాన్‌ను అవమానం తప్పలేదు. పాకిస్తాన్‌కు వెళ్తున్న ఒక కంటైనర్ షిప్‌ను హార్ముజ్ జలసంధి దాటకుండా ఇరాన్ దళాలు నిలిపేశాయి. యూఏఈ షార్జా నుంచి కరాచీ వైపు వెళ్తున్న ఈ నౌకను నిలిపేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తెలిపింది.

Read Also: YouTube Premium: యూట్యూబ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. పైసా ఖర్చు లేకుండా 2 నెలల ప్రీమియం! ఇలా క్లెయిమ్ చేసుకోండి..

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. ఈ జలసంధి ద్వారానే పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ప్రపంచంతో కలుస్తోంది. అయితే, యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేసింది. ప్రపంచ ఇంధన సరఫరాకు ఈ జల మార్గమే కీలకం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదవ వంతు ఈ జలసంధి గుండా వెళుతుంది. యుద్ధం మొదలైన తర్వాత ఈ మార్గంలో వెళ్తున్న ట్యాంకర్లను ఇరాన్ టార్గెట్ చేస్తోంది. దీంతో నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడం, హార్ముజ్ జలసంధి గుండా అనుమతి లేకుండా వెళ్లేందుకు ప్రయత్నించడం వల్ల ‘‘సెలెన్’’ అనే కంటైనర్ నౌకను ఇరాన్ తిప్పి పంపించిందని ఐఆర్‌జీసి నేవీ కమాండర్ అలీ రెజా తంగ్సిరి వెల్లడించారు. ఈ మార్గం గుండా ఏ నౌక ప్రయాణించడానికైనా ఇరాన్ అనుమతి, సమన్వయం అవసరమని చెప్పారు. హార్ముజ్ గుండా స్వేచ్ఛాయుత నౌకయానాన్ని తామే నిర్వహిస్తామని ఇరాన్ ప్రకటించింది. శత్రువులతో సంబంధం లేని నౌకల్ని అనుమతిస్తున్నాట్లు ఇరాన్ ఇటీవల ప్రకటించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Energy crisis
  • global oil impact
  • Iran seizes Pakistan ship
  • Iran War
  • IRGC

తాజావార్తలు

  • Iran War: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన ఇరాన్..

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Sravanthi Chokkarapu: పాత వీడియోలతో కుట్ర.. యాంకర్ స్రవంతి సంచలన వివరణ

  • Kavitha Party: తెలంగాణలో మరో కొత్త పార్టీ.. మార్చి 27న ప్రకటన..

  • YouTube Premium: యూట్యూబ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. పైసా ఖర్చు లేకుండా 2 నెలల ప్రీమియం! ఇలా క్లెయిమ్ చేసుకోండి..

ట్రెండింగ్‌

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions