Iran War: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన ఇరాన్..
- పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన ఇరాన్..
- హార్ముజ్‌లో పాక్ నౌకను సీజ్ చేసిన ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్ తహతహలాడుతోంది. రెండు దేశాల మధ్య యుద్ధం ఆగేందుకు ఇస్లామాబాద్‌లో చర్చలు జరుగుతాయనే నివేదికలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే, ఇరాన్ చేతిలో పాకిస్తాన్‌ను అవమానం తప్పలేదు. పాకిస్తాన్‌కు వెళ్తున్న ఒక కంటైనర్ షిప్‌ను హార్ముజ్ జలసంధి దాటకుండా ఇరాన్ దళాలు నిలిపేశాయి. యూఏఈ షార్జా నుంచి కరాచీ వైపు వెళ్తున్న ఈ నౌకను నిలిపేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తెలిపింది.
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. ఈ జలసంధి ద్వారానే పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ప్రపంచంతో కలుస్తోంది. అయితే, యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేసింది. ప్రపంచ ఇంధన సరఫరాకు ఈ జల మార్గమే కీలకం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదవ వంతు ఈ జలసంధి గుండా వెళుతుంది. యుద్ధం మొదలైన తర్వాత ఈ మార్గంలో వెళ్తున్న ట్యాంకర్లను ఇరాన్ టార్గెట్ చేస్తోంది. దీంతో నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడం, హార్ముజ్ జలసంధి గుండా అనుమతి లేకుండా వెళ్లేందుకు ప్రయత్నించడం వల్ల ‘‘సెలెన్’’ అనే కంటైనర్ నౌకను ఇరాన్ తిప్పి పంపించిందని ఐఆర్‌జీసి నేవీ కమాండర్ అలీ రెజా తంగ్సిరి వెల్లడించారు. ఈ మార్గం గుండా ఏ నౌక ప్రయాణించడానికైనా ఇరాన్ అనుమతి, సమన్వయం అవసరమని చెప్పారు. హార్ముజ్ గుండా స్వేచ్ఛాయుత నౌకయానాన్ని తామే నిర్వహిస్తామని ఇరాన్ ప్రకటించింది. శత్రువులతో సంబంధం లేని నౌకల్ని అనుమతిస్తున్నాట్లు ఇరాన్ ఇటీవల ప్రకటించింది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?