NTV Telugu Site icon

Iran: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ట్రంప్ నిర్ణయం కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది

Iran

Iran

గాజా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆపేందుకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని ప్రపంచమంతా ఎదురుచూస్తోందని ఇరాన్ పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్ మాట్లాడినప్పుడు కూడా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి కూడా ముగింపు ఉంటుందని పేర్కొన్నారు. యుద్ధం ముగింపు వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రెజా అరేఫ్ స్పందించారు.

ఇది కూడా చదవండి: AI Adoption: ప్రపంచంతో పోలిస్తే, AIని తెగవాడుతున్న ఇండియా….

గాజా, లెబనాన్‌లో యుద్ధాలను ఆపడానికి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ఏం నిర్ణయం తీసుకుంటారని ప్రపంచం వేచి చూస్తోందని మొహమ్మద్ రెజా అరేఫ్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్.. గాజా, లెబనాన్‌పై ఐడీఎఫ్ మారణహోమం సృష్టించిందని ఆరోపించారు. ఇజ్రాయెల్ మారణహోమాన్ని వ్యవస్థీకృత ఉగ్రవాదంగా పేర్కొన్నారు. గాజా, లెబనాన్‌లోని అమాయక ప్రజలపై యుద్ధాన్ని తక్షణమే ఆపడానికి ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Weight Loss: జిమ్, వ్యాయమం చేయకుండా బరువు తగ్గొచ్చు.. ఎలాగో తెలుసా..!

అక్టోబర్ 7, 2023లో హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి పౌరులను బందీలుగా తీసుకెళ్లిపోయారు. దీంతో ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. ఆనాటి నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై యుద్ధం చేసింది. దాదాపుగా గాజాను ధ్వంసం చేసింది. ఇక హమాస్ అగ్ర నేతలందరినీ హతం చేసింది. హమాస్ మద్దతు తెలిపిన హిజ్బుల్లా అంతుకూడా చూసింది. హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను అంతమొందించింది. ఇక ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ మాజీ నాయకుడు ఇస్మాయిల్ హనియాను తుదిముట్టించింది. అనంతరం ఎన్నికైన హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను కూడా చంపేసింది. ఇలా నాయకులను ఐడీఎఫ్ లేపేసింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. జనవరి 20, 2025న అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బాధ్యతలు స్వీకరించాక.. ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఎదురుచూస్తున్నారు.

Show comments