Site icon NTV Telugu

Iran-US Conflict: అమెరికాతో అణు చర్చలు జరిపే ఉద్దేశం లేదు..

Iran

Iran

Iran-US Conflict: అగ్రరాజ్యం అమెరికాతో ఎలాంటి అణు చర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని ఇరాన్‌ తేల్చి చెప్పింది. వచ్చే వారం టెహ్రాన్‌తో అణు చర్చలు జరగనున్నాయని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రకటించాడు. అయితే, ట్రంప్‌ వ్యాఖ్యలను తాజాగా ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తోసిపుచ్చారు. అమెరికాతో అణు ఒప్పందానికి సంబంధించి సమావేశం అయ్యే ఆలోచన మాకు లేదని వెల్లడించారు. ఇటీవల తమపై జరిగిన దాడులు తీవ్ర నష్టాన్ని కలిగించాయి.. ఇరాన్‌ అణు కార్యక్రమం పునరుద్ధరణపై అధికారులు రిసెర్చ్ చేస్తున్నారని అరగ్చీ చెప్పారు. ఈ చర్చలపై శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ కరోలినా లీవిట్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి అలాంది ఏమీ లేదన్నారు. కానీ, ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరపడానికి మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్‌తో మాట్లాడుతున్నామని చెప్పుకొచ్చారు.

Read Also: Ahmedabad Plane Crash: ఐరాసకు భారత్ షాక్.. దర్యాప్తు ప్రతిపాదన తిరస్కరణ

అయితే, హేగ్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో డొనాల్డ్ ట్రంప్‌ మాట్లాడుతూ.. వచ్చే వారం ఇరాన్‌తో అణు చర్చలు జరిపే అవకాశం ఉందన్నారు. అణ్వాయుధాలు తయారు చేయాలన్న ఆశయాన్ని వదిలేసేలా టెహ్రాన్‌తో ఒప్పందం చేసుకుంటామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇరాన్‌ చమురుపై యూఎస్ ఆంక్షలు సడలించే ఛాన్స్ ఉందని ట్రంప్‌ తెలిపారు. ప్రస్తుతం ఇరాన్‌ పునర్‌ నిర్మాణానికి నగదు వనరులు కావాలని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆ దేశం కోలుకోవడానికి సపోర్టు ఇవ్వడం కోసం కొన్ని ఆంక్షలను సడలిస్తామని పేర్కొన్నారు.

Exit mobile version