Iran: ‘‘ఇది ముస్లింలపై యుద్ధం’’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్..
Iran: ఇజ్రాయిల్, అమెరికా దాడులు ఇరాన్‌పై తీవ్రమవుతున్నాయి. శనివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు ఇతర నగరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఖమేనీతో పాటు ఇరాన్ టాప్ సైనిక, రాజకీయ నాయకత్వాన్ని తుడిచిపెట్టినట్లు ఇజ్రాయిల్ చెబుతోంది. మరోవైపు, ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలైన సౌదీ, ఖతార్, యూఏఈ, బహ్రైయిన్ వంటి దేశాలపై దాడులు చేస్తోంది. ఆయా దేశాల్లోని యూఎస్ సైనిక స్థావరాలపై దాడి చేసింది.
Read Also: Tata Motors February Sales: సత్తా చాటిన టాటా మోటార్స్.. హ్యుందాయ్, మహీంద్రాలకు షాక్..
Also Read
- Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్‌ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
- Imran Khan: 85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్.. వైద్య కారణాలతో విడుదల కోరుతూ కోర్టుకు అప్పీల్
- Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
ఇదిలా ఉంటే, ఈ దాడులపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందించారు. ఖమేనీ హత్య “ముస్లింలపై యుద్ధ ప్రకటన” అని ఆదివారం అన్నారు. “ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ యొక్క అత్యున్నత రాజకీయ నేత, ప్రపంచవ్యాప్తంగా షియా మతానికి చెందిన ప్రముఖ నాయకుడి హత్య… ముస్లింలపై, ముఖ్యంగా షియాలపై, ప్రపంచంలోని ప్రతిచోటా బహిరంగ యుద్ధ ప్రకటనగా భావించబడుతోంది” ఒక ప్రకటనలో చెప్పారు. యూఎస్ ఇజ్రాయిల్ దాడుల్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. దీనికి బాధ్యులు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని ఇజ్రాయిల్, యూఎస్‌లను హెచ్చరించారు.
ఈ దాడిపై ఉగ్ర సంస్థ హమాస్.. “ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా జరిగిన ఈ స్పష్టమైన దురాక్రమణ, దారుణమైన నేరానికి, అలాగే ఈ ప్రాంతం యొక్క భద్రత, స్థిరత్వంపై దాని తీవ్రమైన పరిణామాలకు అమెరికా మరియు ఫాసిస్ట్ ఆక్రమణ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తాయి.” అని చెప్పింది.
తాజావార్తలు
-
Gold Rate Today: చల్లబడిన బంగారం ధరల వేడి.. హైదరాబాద్‌లో నేటి రేట్స్ ఇవే!
-
Oben Rorr EVO: రూ.1 లక్షకే కొత్త ఓబెన్ రోర్ Evo.. 180KM రేంజ్‌తో అదిరిపోయే బైక్
-
NBK 112 : బాలయ్య-కొరటాల శివ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. మాస్ విద్వంసమే
-
Babar Azam: టీ20 క్రికెట్‌లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్‌ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
-
Instagram Star Murder: భర్త చేతితో ఇన్‌స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!