Iran Military Power: అమెరికానే వణికించేలా ఇరాన్ మిలిటరీ పవర్.. 2,100 క్షిపణులు, వేలాది డ్రోన్లతో యుద్ధానికి సై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Military Power: అమెరికాతో జరుగుతున్న వరుస ఘర్షణల మధ్య ఇరాన్ ఆయుధ సంపత్తికి సంబంధించిన కీలకమైన, సంచలన సమాచారం ప్రపంచ దేశాల ముందుకు వచ్చింది. భవిష్యత్తులో ఒకవేళ పూర్తిస్థాయి యుద్ధం గనుక వస్తే.. గల్ఫ్ దేశాలను కోలుకోలేని దెబ్బ తీసేందుకు ఇరాన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద 1,000కి పైగా అత్యాధునిక క్షిపణులు, 50 రహస్య లాంచర్లు, వేలాది ప్రాణాంతక డ్రోన్లు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. యుద్ధం అంటూ వస్తే తమ ప్రధాన టార్గెట్ యూఏఈ, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాలేనని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించడం గమనార్హం.
అసలు ఇరాన్ వద్ద ఎన్ని ఆయుధాలు ఉన్నాయో తెలుసా?
పలు నివేదికల ప్రకారం.. గతంలో జరిగిన పోరాటంలో అమెరికా ఆర్మీ ఇరాన్‌కు చెందిన 69 రహస్య లాంచర్లను ధ్వంసం చేసింది. అయితే వాటిలో 50 లాంచర్లను ఇరాన్ మళ్లీ పునరుద్ధరించి, శత్రుదేశాలపై దాడికి సిద్ధంగా ఉంచిందని చెబుతున్నారు. వీటితో పాటు దాదాపు 1,000కి పైగా క్షిపణులు ఈ లాంచర్ల ద్వారా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం. గతంలో ఇరాన్ వద్ద సుమారు 3,000 బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్లు అంచనా వేసేవారు. అయితే ఇటీవల అమెరికా పత్రిక ‘వాషింగ్టన్ పోస్ట్’ ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారం ఉటంకిస్తూ ఒక సంచలన నివేదికను ప్రచురించింది. దీని ప్రకారం.. యుద్ధంలో దెబ్బతిన్నప్పటికీ ఇరాన్ తన పాత క్షిపణి సామర్థ్యంలో 70 శాతాన్ని మళ్లీ పునరుద్ధరించుకుందట. అంటే ప్రస్తుతం ఇరాన్ అమ్ములపొదిలో దాదాపు 2,100 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. అలాగే ఇరాన్ వద్ద మొత్తం 100 మిస్సైల్ లాంచర్లు ఉండగా, అందులో 50 లాంచర్లు అత్యంత రహస్య ప్రాంతాల నుంచి ఆపరేట్ అవుతున్నాయి. వీటికి తోడు గల్ఫ్ దేశాలపై గతంలో విరుచుకుపడిన ప్రమాదకరమైన ‘షాహెద్ డ్రోన్లు’ (Shahed Drones) కూడా ఇరాన్ వద్ద వేల సంఖ్యలో ఉన్నాయి.
Also Read
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
- Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
ఇరాన్‌కు చైనా, రష్యాల అండ
ఇరాన్ ఆయుధాల తయారీ వెనుక చైనా కంపెనీల హస్తం భారీగా ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. చైనా నుంచి అందిన కీలక విడిభాగాల (Spare Parts) సహాయంతోనే ఇరాన్ అతి తక్కువ ఖర్చుతో కూడిన రాకెట్లు, క్షిపణులను పెద్ద సంఖ్యలో తయారు చేసి నిల్వ చేసుకోగలిగిందని అంటున్నారు. చైనాతో పాటు రష్యా కూడా ఇరాన్‌కు ఆయుధ భాగాలను సరఫరా చేస్తూ వెన్నుదన్నుగా నిలిచిందని చెబుతున్నారు. ఈ రెండు దేశాలు ఇరాన్‌కు నమ్మకమైన మిత్రదేశాలుగా వ్యవహరిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇటీవల బీజింగ్ పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. “ఇరాన్‌కు ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా నాకు మాట ఇచ్చింది” అని ప్రకటించారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై చైనా ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పంద చర్చలు!
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ (Ceasefire) ప్రకటించిన నేపథ్యంలో, అణు ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా – ఇరాన్ సిద్ధమవుతున్నాయి. పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) లో శాంతి స్థాపన కోసం కతార్, పాకిస్థాన్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే అణు ఒప్పందానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కఠినమైన ప్రతిపాదనను ఇరాన్ ముందు ఉంచారు. అంతర్జాతీయ రవాణాకు అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ని (Strait of Hormuz) ఇరాన్ అన్ని దేశాల నౌకల కోసం తెరిచి ఉంచాలి. అలాగే అమెరికా పర్యవేక్షణలోనే ఇరాన్ తన యురేనియం సుసంపన్నం చేసే కార్యక్రమాన్ని శాశ్వతంగా నిలిపివేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలపై చర్చలు కొనసాగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
- Tags
- Drones
- Iran
- Missiles
- Nuclear deal
- trump
తాజావార్తలు
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!