Site icon NTV Telugu

Iran War: హార్ముజ్ వద్ద F-15 ఫైటర్ జెట్‌ను కూల్చేసిన ఇరాన్..

F 15 Shot Down

F 15 Shot Down

Iran War: ఇరాన్ భారీ ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధి సమీపంలో శత్రవుకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం ఆదివారం ప్రకటించింది. ఈ చర్య ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ పనితీరును ప్రతిబింబిస్తుంది. అధునాతన అమెరికన్ యుద్ధ విమానాన్ని ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించి క్షిపణి ద్వారా కూల్చేనట్లు చెబుతోంది. గగనతల రక్షణ వ్యవస్థ ఎఫ్-15ను లాక్ చేస్తున్నట్లు చూపిస్తున్న ఒక వీడియోను కూడా ఆ ఏజెన్సీ విడుదల చేసింది. అయితే, ఈ విషయాన్ని అమెరికా కానీ, ఇతర గల్ఫ్ దేశాలు ధ్రువీకరించలేదు.

Read Also: Government Schemes for Farmers: భారత ప్రభుత్వం రైతుల కోసం ఎన్ని పథకాలను అమలు చేస్తోందో తెలుసా? పూర్తి వివరాలు

ఈ యుద్ధం కారణంగా అమెరికా సైన్యం గణనీయమైన నష్టాన్ని చవిచూస్తోంది. నివేదిక ప్రకారం ఇప్పటి వరకు అమెరికా 17 సైనిక విమానాలను కోల్పోయింది. వీటిలో 12 డ్రోన్లు, నాలుగు మానవ సహిత విమానాలు ఉన్నాయి. ఇందులో ఒక ఎఫ్-35 యుద్ధ విమానం దెబ్బతింది. గతంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఒక ఎఫ్-16 విమానాన్ని కూల్చేసిందనే వార్త వచ్చినప్పుడు అమెరికా దీనిని కొట్టిపారేసింది.

యూఎస్ ఇప్పటి వరకు ఎక్కువగా డ్రోన్లను నష్టపోయింది. 12 యూఎస్ ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌లను ఇరాన్ కూల్చేసింది. ఇది సుదూర నిఘా, ఖచ్చితమైన దాడుల కోసం ఉపయోగించే డ్రోన్. దీనికి హెల్‌ఫైర్ క్షిపణి అమర్చబడి ఉంటుంది. సుమారు 72 గంటల పాటు గాలిలో ఉండగలదు. ఇదిలా ఉంటే, ఈ యుద్ధంలో అమెరికాకు చెందిన గాలిలో ఇంధనాన్ని నింపే విమానం కూడా కూలిపోయింది. ఇరాక్‌ గగనతలంలో దీనిని ఇరాన్ కూల్చేసింది. దీంట్లో ఆరుగురు సిబ్బంది మృతి చెందింది.

Exit mobile version